స్టైలిష్ స్టార్ సూపర్ ప్లాన్: పుష్పలోకి నివేదా థామస్‌ ఎంట్రీ అలా.. అసలు కహానీ ఇదే..

By Manoj

మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోనే అయినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌తో రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అదే సమయంలో సరికొత్త స్టైల్స్‌ను పరిచయం చేస్తూ యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న అతడు... తన తదుపరి సినిమా కోసం సూపర్ ప్లాన్‌ రెడీ చేశాడని తెలిసింది. దీని గురించి తెలిసిన వాళ్లందరూ అల్లు అర్జున్ ముందుచూపుకు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ బన్నీ ఏం చేశాడు..? పూర్తి వివరాల్లోకి వెళితే...

కలిసొచ్చిన డైరెక్టర్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

కలిసొచ్చిన డైరెక్టర్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

గతంలో ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్లు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అల్లు అర్జున్ మరోసారి జత కట్టాడు. వీళ్ల కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురములో' కూడా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీకి థమన్ ఇచ్చిన పాటలు ప్లస్ అయ్యాయి.

ఆ విషయంలో ఆశ్చర్యపరిచిన అల్లు అర్జున్

ఆ విషయంలో ఆశ్చర్యపరిచిన అల్లు అర్జున్

సుకుమార్‌ - అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాకు ‘పుష్ప' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ.. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రాబోతుంది. ఇందులో బన్నీ మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడన్నార. అందుకు అనుగుణంగానే ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించారు. అయితే, ఇది పాన్ ఇండియా మూవీ అని ఎవరూ ఊహించలేదు.

రష్మిక మందన్నాతో అల్లు అర్జున్ రొమాన్స్

రష్మిక మందన్నాతో అల్లు అర్జున్ రొమాన్స్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రచారం అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో రష్మిక రొమాన్స్ ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేశారనేది బాగా ప్రచారం అయిన విషయం తెలిసిందే.

‘పుష్ప’లో మరో హీరోయిన్.. ఫుల్ టాలెంట్‌

‘పుష్ప’లో మరో హీరోయిన్.. ఫుల్ టాలెంట్‌

పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రాబోతున్న ‘పుష్ప' గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇందులో మరో హీరోయిన్ నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. తన టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారని అంటున్నారు. తక్కువ సమయమే ఉన్నా.. కథను మలుపు తిప్పే పాత్ర ఆమెదని సమాచారం.

Recommended Video

Allu Arjun got Emotional Over Lighting Up Indian Flag on Swiss Alps
నివేదాను తీసుకోవడం వెనుక ఇంత కథ ఉందా.!

నివేదాను తీసుకోవడం వెనుక ఇంత కథ ఉందా.!

వాస్తవానికి ఈ పాత్ర కోసం ఎంతో మంది హీరోయిన్లను అనుకున్నాడట సుకుమార్. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్.. నివేదా పేరును సూచించాడని తెలిసింది. దీని వెనుక బలమైన కారణం ఉందని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... నివేదా దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించడమే అని అంటున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలు భాషల్లో పరిచయమున్న హీరోయిన్ అయితే బాగుంటుందని బన్నీ ప్లాన్ చేశారని, ఆ క్రమంలో నివేదా థామస్ అయితే బాగుంటుందని బన్ని, సుకుమార్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X