అల్లు అర్జున్ త్వరలో సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం.యల్లో ప్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల నిర్మించే ఆ చిత్రం భారీ బడ్జెట్ తో ఉండబోతోందని తెలుస్తోంది.రమేష్ పుప్పాల తన పుట్టిన రోజున సురేంద్రరెడ్డి కాంబినేషన్ తో చేయబోయే హీరో ప్రకటిస్తానని చెప్పటం జరిగింది.అది అల్లు అర్జునే అని కన్ఫర్మ్ అయింది.ఇక రమేష్ పుప్పాల గతంలో రవితేజతో మిరపకాయ అనే చిత్రం తీసి హిట్టు ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ప్రి ప్రొడక్షన్ వర్క్ చాలా బిజీగా జరుగుతోంది.సురేంద్ర రెడ్డి తన ఊసరవిల్లి చిత్రం పూర్తవగానే వెంటనే ఈ ప్రాజెక్టులోకి వస్తారు.ఇక ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని సమర్పించనున్నారు.ఈలోగా అల్లు అర్జున్,త్రివిక్రమ్ షూటింగ్ మొదలవుతుంది.