'సరిలేరు నీకెవ్వరు' ఈవెంట్ స్పెషల్ గెస్ట్ చిరంజీవి.. అల్లు అర్జున్ ఇలా అనడంతో వాళ్లు!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో సరికొత్త హంగామా కనిపించనుందని స్పష్టంగా తెలుస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ ఓ రేంజ్‌లో పోటీపడనుండటం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో సినిమాల విషయంలో జనాల్లో ఆతృత నెలకొంది. అయితే విడుడలకు ముందు ఈ రెండు చిత్రాలు ప్రమోషన్స్ పరంగా కూడా హాట్ హాట్ చర్చలకు తావిస్తున్నాయి.

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్.. చిరంజీవి

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్.. చిరంజీవి

జనవరి 11న మహేష్ బాబు- 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కానున్న నేపథ్యంలో ఈ రోజు (జనవరి 5) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఎంతో ఘనంగా నిర్వహించనున్న ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. దీంతో ఈ ఈవెంట్‌పై సూపర్ స్టార్ అభిమానులతో పాటు మెగా అభిమానులు సైతం ఆసక్తిగా ఉన్నారు.

అల.. వైకుంఠపురములో.. ముదిరిన చర్చ

అల.. వైకుంఠపురములో.. ముదిరిన చర్చ

ఇక మరోవైపు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ విషయానికొస్తే ఈ ఈవెంట్‌కి స్పషల్ గెస్ట్ అంటూ ఏవారు లేరు. కేవలం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇతర యూనిట్ సభ్యులతోనే ఈ ఈవెంట్ ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసింది చిత్రయూనిట్. దీంతో అసలు గెస్ట్ రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందనే దానిపై చర్చలు ముదిరాయి.

అల్లు అర్జున్ సూచన.. అందుకే అలా

అల్లు అర్జున్ సూచన.. అందుకే అలా

అయితే తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్ సూచన మేరకే ఈ ఈవెంట్ కోసం ఏ గెస్ట్‌ని ఆహ్వానించలేదని తెలుస్తోంది. టాలీవుడ్‌‌లో చిరంజీవిని మించిన గెస్ట్ లేని కారణంగా ఎవరూ వద్దని బన్నీ అల.. వైకుంఠపురములో యూనిట్‌తో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవిపై ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో మరే గెస్ట్‌ను తన సినిమా కోసం ఆహ్వానించవద్దని అల్లు అర్జున్ అన్నాడట.

పోటీ ఎంత ఉన్నప్పటికీ..

పోటీ ఎంత ఉన్నప్పటికీ..

సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీ ఎంత ఉన్నప్పటికీ.. మరెవరినైనా పిలిస్తే, చిరంజీవి స్థాయి తగ్గినట్లవుతుందని బన్నీ అనుకున్నాడని, అందుకే ఎవరినీ గెస్ట్ గా పిలవకుండానే కార్యక్రమం నిర్వహించాలని నిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది.

'అల.. వైకుంఠపురములో' సంక్రాంతి స్పెషల్

'అల.. వైకుంఠపురములో' సంక్రాంతి స్పెషల్

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' రూపొందింది. ఈ సినిమా కూడా సంక్రాంతికి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. నివేదా పేతు రాజ్, సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X