రెండిటిలో ఏది నిజం?? అల్లు అర్జునే తేల్చాలి

By Srikanya

హైదరాబాద్: అల్లు అర్జున్ వంటి కమర్షియల్ హీరో చేసే చిత్రాలు అంటే అందరికీ ఆసక్తికరమే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ఆయన తదుపరి ఎవరి దర్శకత్వంలో చేయబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ త్వరలో శేఖర్ కమ్ముల డైరక్షన్ లో చేయబోతున్నట్లు వార్త మీడియాలో వచ్చింది. ముకుందా లో గెస్ట్ రోల్ చేసిన శేఖర్ కమ్ముల..ఆ సమయంలో అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ కు తన దగ్గర ఉన్న ప్లాట్ లైన్ చెప్పాడని, వెంటనే ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్ పూర్తి స్టోరీ నేరేట్ చేయమన్నట్లు చెప్పుకుంటున్నారు.

https://www.facebook.com/TeluguFilmibeat

మరో ప్రక్క మిర్చి ఫేం కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా ఓకే అయినట్లు ఇంతకు ముందు వార్త వచ్చింది. మహేష్‌బాబు సినిమాను శివ మే1 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా...మరోవైపు త్రివిక్రమ్‌ బన్నీల సినిమాకూడా విడుదలకు సిద్ధమవుతుంది. అంటే వీరి సినిమా తొందర్లనే పట్టాలెక్కబోతుందని అంటున్నారు. మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజం అనేది తేలియాలి.

Allu Arjun to act in Sekhar Kammula's film

అయితే శేఖర్ కమ్ముల వంటి ఫీల్ గుడ్ చిత్రాలు తీసే దర్శకుడుతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తాడా, లేక యాక్షన్ ,లవ్ స్టోరీతో ముందుకు వెళ్తున్న కొరటాల శివతో ముందుకు వెళ్తాడా అనేది ఇప్పుడు అందరినీ మాట్లాడుకునేలా చేస్తోంది. అలాంటిదేమీ లేదు...ఇది కేవలం రూమరే అని కొందరు బన్ని అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఈ విషయమై బన్ని కానీ శేఖర్ కమ్ముల కానీ మాట్లాడితే కానీ ఈ చర్చ ఆగేటట్లు లేదు.

ఆనంద్‌, హ్యాపీడేస్‌, లీడర్‌, లైఫ్‌ ఇజ్‌ బ్యూటీఫుల్‌'....వంటి ఫీల్‌ గుడ్‌ సినిమాలు తీసే శేఖర్‌కమ్ముల...ఎప్పుడూ కమర్షియల్‌ సినిమాలు తీయలేదు. అయితే రీసెంట్ గా ప్రకారం శేఖర్‌ కమ్ముల, అల్లు అర్జున్‌కి కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కథ బన్నీకి కూడా నచ్చడంతో పూర్తి స్ర్కిప్ట్‌ శేఖర్‌కమ్ములను సిద్ధం చేసుకోమన్నాడని సమాచారం. అయితే ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శేఖర్‌ కమ్ముల కూడా ఈ ఏడాది ‘హ్యాపీడేస్‌' చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

‘హ్యాపీడేస్‌' రీమేక్‌ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌ నిర్మించబోతున్నాడని సమాచారం. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా తీసే ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే శేఖర్‌ కమ్ముల కూడా కమర్షియల్‌ సినిమాలు తీయగలడని నిరూపించుకోవడానికి ఇదో అవకాశంగా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ మంచి మాస్ హీరో. ఇప్పటివరకు తను చేసిన తరహా మాస్ చిత్రాలను శేఖర్ కమ్ముల తీయలేదు. మరి.. బన్నీ తరహాలో మాస్ చిత్రం చేస్తారా? లేక తనదైన శైలిలో బన్నీని వేరే విధంగా ఆవిష్కరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

బన్నీ ప్రస్తుత చిత్రం విషయానికి వస్తే...

ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆ చిత్రంలో ఇటీవలే ప్రముఖ హీరోయిన్ స్నేహ ముఖ్య భూమిక పోషించనున్నారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ కు వదినా స్నేహ నటించనున్నారు. అయితే ఆ చిత్రంలో అల్లు అర్జున్ సోదరుడిగా, స్నేహాకు భర్తగా ఉపేంద్ర నటిస్తున్నారు. సమంతా, అదా శర్మలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X