హిందీ చిత్రంలో అల్లు అర్జున్...డిటేల్స్
హైదరాబాద్ : హీరోయిన్స్ ఇక్కడో అడుగు..అక్కడో అడుగు అన్నట్లుగా ఎప్పుడూ బాలీవుడ్ వైపు ఓ లుక్కేస్తున్న విషయం తెలిసిందే. అదే రూటులో ఇటీవల మన యువ హీరోలు హిందీ సినిమాలపై మక్కువ చూపుతున్నారు. రానా ఇప్పటికే అక్కడ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
'జంజీర్'తో రామ్‌చరణ్ హిందీలోకి అడుగుపెట్టారు. ప్రభాస్ ఆమధ్య 'యాక్షన్ జాక్సన్'లో తళుక్కున మెరిశారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతొచ్చింది. ఆయన ఇటీవల ఓ హిందీ చిత్రంలో నటించారని సమాచారం.
వరుణ్‌ధావన్, శ్రద్ధాకపూర్ జంటగా 'ఏబీసీడీ2' చిత్రం తెరకెక్కుతోంది. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో బన్నీ నటించినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు డ్యాన్స్ అంటే అభిమానం. అందుకే ఆయనకు 'ఏబీసీడీ2'లో నటించే అవకాశం లభించినట్టు సమాచారం. మరి బన్నీ పాత్ర తెరపై ఎంతసేపు కనిపిస్తుందన్నది తెలియాల్సి ఉంది. ఇందులో ప్రభుదేవా కూడా ఓ కీలక పాత్రను పోషించారు.

అల్లు అర్జున్ తాజా చిత్రం విషయానికి వస్తే...
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘S/O సత్యమూర్తి' . ఈ చిత్రం అఫీషియల్ టైటిల్ లోగో ని ఇప్పటికే విడుదల చేసారు. ‘విలేవలే ఆస్తి' అనేది సబ్ టైటిల్. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోందీ ఈ చిత్రం . ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..వెడ్డింగ్ ప్లానర్ గా కనిపిస్తారు.
నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్రం తరువాత అల్లు అర్జున్ రేసుగుర్రం చిత్రం తరువాత చేస్తున్నందున ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నాం. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం స్పెయిన్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మినహ షూటింగ్ మెత్తం పూర్తవుతుంది. మరి కొద్దిరోజుల్లో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. అని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము.. అని అన్నారు.
ప్రస్తుతం స్పెయిన్ లో పాటల చిత్రీకణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ తో ఒక్క పాట షూటింగ్ మినహ షూటింగ్ మెత్తం పూర్తవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.


Click it and Unblock the Notifications











