For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలీవుడ్‌లోకి అల్లు అర్జున్: ‘అల’ కనిపించనున్న ఐకాన్ స్టార్.. పుష్ప కంటే ముందే ఆ స్పెషల్ మూవీ

  |

  మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటిస్తోన్నాడు ఈ మెగా హీరో. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ త్వరలోనే మరో హిందీ చిత్రంలో నటించబోతున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయట వచ్చింది. ఇంతకీ ఏంటా మూవీ? దానికి సంబంధించిన వివరాలు మీ అందరి కోసం!

   చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీ హిట్

  చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీ హిట్

  అల్లు అర్జున్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లే అవుతోంది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. ఇండస్ట్రీ హిట్‌ను మాత్రం ఈ మధ్యనే దక్కించుకున్నాడు. అదే గత ఏడాది వచ్చిన ‘అల.. వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ సినిమా భారీ హిట్ అయింది. అదే సమయంలో కలెక్షన్లను కూడా ఓ రేంజ్‌లో రాబట్టింది.

   అన్ని రకాలుగానూ విజయవంతం

  అన్ని రకాలుగానూ విజయవంతం

  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘అల.. వైకుంఠపురములో' చిత్రం టాలీవుడ్ హిస్టరీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ, బుల్లితెరపైన కూడా ఇది సక్సెస్‌‌ను అందుకుంది. అంతేకాదు, ఈ చిత్రంలోని పాటలకు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఇందులోని పాటలన్నీ కలిపి రెండు వేల మిలియన్లకు పైగా వ్యూస్‌ను అందుకుని చరిత్ర సృష్టించాయి.

   బాలీవుడ్‌లోకి అల్లు అర్జున్ మూవీ

  బాలీవుడ్‌లోకి అల్లు అర్జున్ మూవీ

  తెలుగులో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న ‘అల.. వైకుంఠపురములో' మూవీ బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతోంది. రోహిత్ ధావన్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, బన్నీ తల్లి టబు పాత్రలో మనీషా కోయిరాల నటిస్తోంది. ‘షాజాదే' (యువరాజు) అనే టైటిల్‌తో వచ్చే ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

  బాలీవుడ్‌లోకి అల్లు అర్జున్ ఎంటర్

  బాలీవుడ్‌లోకి అల్లు అర్జున్ ఎంటర్

  తన డబ్బింగ్ చిత్రాల ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు చేరువ అయ్యాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ క్రమంలోనే అతడు నేరుగా బాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నాడని ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ‘అల.. వైకుంఠపురములో' రీమేక్ ‘షాజాదే'లో బన్నీ ఓ గెస్ట్ రోల్‌ను చేస్తున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.

   బన్నీకి స్పెషల్‌గా క్రియేట్ చేశారా?

  బన్నీకి స్పెషల్‌గా క్రియేట్ చేశారా?

  ‘షాజాదే'లో అల్లు అర్జున్ ఓ గెస్ట్ రోల్‌ను చేస్తున్నాడన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఏ పాత్రలో కనిపిస్తాడని అంతా చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ‘అల.. వైకుంఠపురములో' చిత్రంలో గెస్ట్ రోల్ పాత్ర ఏదీ లేదు. అందుకే దీని గురించి చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో బన్నీ కోసం ఏదైనా పాత్రను క్రియేట్ చేశారా అన్న కోణంలోనూ మాట్లాడుకుంటున్నారు.

  Allu Arjun Biography | Why Allu Arjun Is Biggest PAN India Star ? | Filmibeat Telugu
   పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు

  పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు

  భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ కంటే ముందే బన్నీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడట.

  English summary
  Tollywood Star Hero Allu Arjun Now Doing Pushpa Under Sukumar Direction. After That He will Do A Guest Role in Ala Vaikunthapurramloo Remake Shehzade Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X