ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, అల్లు అర్జున్: స్టార్ డైరెక్టర్ సూపర్ డూపర్ ప్లాన్.. ముహూర్తం కూడా ఫిక్స్!

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయం అయినా.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుని స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్, హోస్టింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ హవాను చూపిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. మధ్యలో కొన్ని పరాజయాలను చవి చూశాడు.

అయితే, కొంత కాలంగా మాత్రం వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను ప్రకటించిన తారక్.. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

వరుసగా ఐదు విజయాలతో హవా

వరుసగా ఐదు విజయాలతో హవా

సుదీర్ఘ కాలంగా ఎన్టీఆర్ టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్' నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను తన ఖాతాలో వేసకున్నాడు. అదే సమయంలో మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

పాన్ వరల్డ్ చిత్రంలో జూనియర్

పాన్ వరల్డ్ చిత్రంలో జూనియర్

వరుస హిట్లతో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి పాత్రలను పోషిస్తున్నారు.

ఒకరితో అనుకుంటే ఇంకొకరితో

ఒకరితో అనుకుంటే ఇంకొకరితో

RRR మూవీ పట్టాలపై ఉన్న టైంలోనే తారక్ తన 30వ సినిమాను త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇది ప్రకటనకే పరిమితం అయిపోయింది. ఎన్నో మలుపుల నడుమ ఈ సినిమాను ఆపేసినట్లు ప్రకటించారు. అనంతరం 30వ ప్రాజెక్టును కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది.

ఎన్టీఆర్ 30వ మూవీలో వాళ్లంతా

ఎన్టీఆర్ 30వ మూవీలో వాళ్లంతా

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడట. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రానుంది.

ఎప్పటికప్పుడూ ఆలస్యం చేస్తూ

ఎప్పటికప్పుడూ ఆలస్యం చేస్తూ

‘జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీని గురించి ఎన్నో రకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది ఫలానా రోజు ప్రారంభం అవుతుందని అంటూ వస్తున్నారు. కానీ, ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకూ మొదలవలేదు.

 ఒకే ఫ్రేమ్‌లో తారక్, అల్లు అర్జున్

ఒకే ఫ్రేమ్‌లో తారక్, అల్లు అర్జున్

క్రేజీ కాంబినేషన్‌లో భారీ స్థాయిలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ పాన్ ఇండియా మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నాడట. కొరటాల శివ కోరిక మేరకు బన్నీ వెంటనే ఓకే చెప్పేశాడట. ఈ ప్రకటన అతి త్వరలోనే రానుందని తెలిసింది.

Recommended Video

RRR ట్రైలర్‌ విడుదల ఆ రోజే..? || Filmibeat Telugu
ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు

ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు

ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి 18వ తేదీన జరగబోతున్నాయట. హైదరాబాద్‌లో దీన్ని అంగరంగ వైభవంగా చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికి మరికొందరు గెస్టులు కూడా వస్తున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X