For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుష్ప కోసం సల్మాన్ ఖాన్ తో అల్లు అర్జున్.. రంగంలోకి ప్రభాస్ కూడా.. ఇక బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక పాయింట్ హైలెట్ అయ్యేలా చూసుకుంటాడు. ప్రస్తుతం అతని టార్గెట్ అయితే మామూలుగా లేదు. అల.. వైకుంఠపురములో సినిమాతో వచ్చిన క్రేజ్ అనంతరం పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు. పుష్ప సినిమాతో నార్త్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఆ సినిమా కోసం బన్నీ ఇండియన్ సూపర్ స్టార్స్ ను కూడా రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.

    నార్త్ లో కూడా భారీగా..

    నార్త్ లో కూడా భారీగా..

    అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై తెలుగులో అయితే అంచనాలు భారిగానే ఉన్నాయి. కానీ హిందీలో ఇంకా సరైన స్థాయిలో బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. నిన్నా మొన్నటి వరకు అసలు నార్త్ లో థియేట్రికల్ గా రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహాలు కూడా చాలానే వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను పుష్పను వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ గానే భారీగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

    గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

    గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

    ఇక వరుస బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సినిమాను 180కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కూడా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. వీలైనంత వరకు భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయాలని చూస్తున్నారు. డిసెంబర్ లోనే ప్రీ రిలీజ్ వేడుక ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

    పుష్ప కోసం ప్రభాస్

    పుష్ప కోసం ప్రభాస్

    ఇక పుష్ప కోసం ప్రభాస్ కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితేనే సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుందని బన్నీ ప్రభాస్ సహాయం కోరుతున్నాడు. ప్రభాస్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతున్నట్లు తెలుస్తోంది. బన్నీతో ఒకప్పుడు ప్రభాడ్ చాలా క్లోజ్ గా ఉండేవారు. ఇక మైత్రి సంస్థలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా కూడా వస్తాడని చెప్పవచ్చు.

    సల్మాన్ ఖాన్ ద్వారా..

    సల్మాన్ ఖాన్ ద్వారా..

    ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ ద్వారా పుష్ప సినిమాను ప్రమోట్ చేయబోతున్నారట. బిగ్ బాస్ షోకు హోస్ట్ గా ఉన్న సల్మాన్ ఖాన్ అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా ఆ రియాలిటీ షోకు ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. బిగ్ బాస్ షో అంటే నార్త్ జనాలకు ఎంతో ఆసక్తి. అలాంటి బుల్లితెర షోలోకి వెళితే తప్పకుండా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అల్లు అర్జున్ ఎంతవరకు హైప్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

    Recommended Video

    Latest Tollywood Updates : Allu Arjun ఖాతాలో ఓ అరుదైన రికార్డు..! || Filmibeat Telugu
    ట్రైలర్ ఎప్పుడంటే?

    ట్రైలర్ ఎప్పుడంటే?

    ఇక పుష్ప సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. మరి వారి అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

    English summary
    Allu Arjun to share stage with indian stars prabhas salman khan for pushpa..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X