Allu Arjun: అల్లు అర్జున్ కొత్త అవతారం? ఐకాన్ స్టార్ నెక్ట్స్ లెవల్ ప్లాన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని మరింత పెంచుకుంటున్న అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ కు చేరారు. పుష్ప సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా మారిపోయారు. తాజాగా అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ తో ప్రాజెక్ట్, ఆపై సందీప్ రెడ్డి వంగా లేదా త్రివిక్రమ్ తో మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా, అదే సమయంలో పుష్ప 3 కూడా లైన్లోకి వచ్చే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది.

ఇలా నటుడిగా పీక్ ఫేజ్‌లో ఉన్న తరుణంలోనే, బన్నీ మరో కీలక బాధ్యతను కూడా తన భుజాలపై వేసుకోనున్నారంట. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం ఏమిటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన తండ్రి అల్లు అరవింద్ ( Allu Aravind) స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్ (Geetha Arts) బాధ్యతలను పూర్తిగా చేపట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. బన్నీ తొలిసారి ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే బలమైన ఊహాగానాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Allu Arjun to Take Over Geetha Arts Icon Star Planning Producer Debut Amid Busy Film Lineup

50 ఏళ్ల లెగసీకి కొత్త దిశ

1972లో స్థాపించబడిన గీతా ఆర్ట్స్ తెలుగు సినిమాకు అనేక బ్లాక్‌బస్టర్లు అందించింది. అల్లు రామలింగయ్య భగవద్గీత నుంచి స్ఫూర్తి పొంది ఈ సంస్థకు 'గీత' అనే పేరు పెట్టారని సినీ వర్గాలు చెబుతాయి. దశాబ్దాలుగా ఈ బ్యానర్ కేవలం సినిమా నిర్మాణంతోనే కాకుండా పంపిణీ, థియేటర్ల నిర్వహణ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వంటి విభాగాల్లో విస్తరించింది. తాజాగా హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న అల్లు స్టూడియోస్ (Allu Studios) వెనుక కీలక ఆలోచన కూడా అల్లు అర్జున్‌దేనని సమాచారం.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సంస్థ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఇండస్ట్రీ సోర్సెస్ చెబుతున్నాయి. సీనియర్ సిబ్బందితో పాటు యువతకు కూడా అవకాశాలు కల్పిస్తూ, సంస్థలో కొత్త మార్పులు తీసుకొస్తున్నారని సమాచారం. రోజువారీ సమీక్షలు, భవిష్యత్ ప్రణాళికలు, విస్తరణ వ్యూహాలు ఇవన్నీ బన్నీ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని టాక్. అల్లు అరవింద్ క్రమంగా యాక్టివ్ వ్యాపార బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని ప్రశాంత జీవితం గడపాలని భావిస్తున్న తరుణంలో, ఆ సామ్రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను అల్లు అర్జున్ స్వీకరించారని చెబుతున్నారు.

తొలి ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్‌పై బజ్
ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో ఆసక్తికర వార్త ఏమిటంటే.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అర్జున్ తన తొలి ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారట. 'ఎక్సైటింగ్ కాంబినేషన్'లో ఈ సినిమా ఉండనుందని, హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా గోప్యంగానే ఉందని సమాచారం. కొందరు ఫ్యాన్స్ అయితే ప్రభాస్‌తో సినిమా చేయాలని సూచిస్తుంటే, మరికొందరు 'తనకే తానే హీరోగా ఉంటే?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికీ ఇవన్నీ అధికారిక ప్రకటనలుగా మారకపోయినా, బన్నీ ప్రొడ్యూసర్ అవుతారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గీతా ఆర్ట్స్ లెగసీని కొత్త బన్నీ అడుగులు వేస్తున్నారనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.

అల్లు అర్జున్ ఇప్పటికే తన కెరీర్‌లో ప్రతి అడుగూ లెక్కచేసి వేస్తారనే టాక్. అదే వ్యూహం నిర్మాణ రంగంలోనూ చూపిస్తే గీతా ఆర్ట్స్ మరో సువర్ణ అధ్యాయం ప్రారంభించవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక ప్రకటన కోసం ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇంతకీ బన్నీ ప్రొడక్షన్స్ సైడ్ వస్తారా? ప్రొడ్యూసర్ గా మారుతారా? ఒక్క వేళ మరితే.. సినిమా ఎవరితో ఉంటుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: allu arjun geetha arts tollywod
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X