మరో ప్రయోగం చేయబోతున్న అల్లు అర్జున్.. ఆ సినిమా కోసం ఏకంగా అలా!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో పాటు ఆర్య, ఆర్య-2 తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తరువాత ఆయన చేయబోతున్న ఐకాన్ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

 రెండు భాగాలుగా

రెండు భాగాలుగా

ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో డి గ్లామర్ లుక్ లో కనిపిస్తుండడంతో పాటు నత్తి కూడా ఉన్న పాత్రలో కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద అందరి దృష్టి సినిమా మీదనే కేంద్రీకృతమై ఉంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ముందు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే నిర్మాతలు కూడా ఖరారు చేసేశారు.

పుష్పతో బిజీ

పుష్పతో బిజీ

అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తున్న ఈ సినిమా ఈ ఆగస్టు 13న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో ఎప్పటికి రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. అయితే ఈ విరామం తరువాత, షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి పుష్ప టీం సిద్దం అవుతోందని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు జూలై 5 నుండి హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమవుతుంది.

 సేఫ్ గేమ్ ఆడుతూ

సేఫ్ గేమ్ ఆడుతూ

ఇక టాలీవుడ్‌లోని చాలా మంది నటీనటులు తమ కంఫర్ట్ జోన్‌ను విడిచి బయటకు రాకుండా సేఫ్ గేమ్ ఆడటానికి ఇష్టపడతారు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం చేసే ప్రతి సినిమాలో తన లుక్ అలాగే రోల్‌ వేరియేషన్స్ తో అలరిస్తూ ఉంటాడు. అందుకే తన కెరీర్ ప్రారంభ దశ బన్నీ వివిధ చిత్రాలలో విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేశాడు.

బ్లైండ్ పాత్రలో

బ్లైండ్ పాత్రలో

తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు అల్లు అర్జున్ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి చేయబోయే సినిమా ఐకాన్ కోసం అంధుడిగా మారుతున్నాడని తెలుస్తోంది. బ్లైండ్ వ్యక్తిగా నటుస్తూ ఆ ప్రయోగాత్మక చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని అంటున్నారు.

Recommended Video

Interesting Facts About Rekha | Happy Birthday Rekha
కనబడుట లేదు అందుకే

కనబడుట లేదు అందుకే

అందుకే ఈ సినిమాకి కనబడుట లేదు అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారని అంటున్నారు. ఇక ప్రస్తుతానికి, ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ లేదు, అయినా ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుటింది. మరో పక్క ఐకాన్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఇందులో ఎంత వరకూ నిజం ఉంటుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X