హిట్ కాంబో: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్.. తండ్రి కోసం స్టైలిష్ స్టార్ షాకింగ్ డెసీషన్.!
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అది హీరో.. హీరోయిన్‌ది కావచ్చు, హీరో.. డైరెక్టర్‌ది కావచ్చు, ఇంకేదైనా అవ్వొచ్చు. సెంటిమెంట్లను ఎక్కువగా విశ్వసించే సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ కాంబో అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబో ఒకటి. ఇప్పటి వరకు వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ మరోసారి కలిసి పని చేయబోతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.!

హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్ కొట్టారు
త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో గతంలో ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్లు వచ్చాయి. ఇక, ఈ సంక్రాంతికి వీళ్లిద్దరి మూడో సినిమా ‘అల.. వైకుంఠపురములో' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో ఈ జంటకు ఒకేసారి హ్యాట్రిక్‌తో పాటు భారీ హిట్ దక్కింది.

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్
తెలుగులో బంపర్ హిట్ అయిన ‘బాహుబలి' తర్వాతి రికార్డులన్నింటీని చెరిపివేసింది ‘అల.. వైకుంఠపురములో'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారని కొద్ది రోజుల కిందట ఓ వార్త బయటకు వచ్చింది. ఈ మేరకు అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో చర్చలు కూడా జరిపాడని ప్రచారం జరిగింది. అయితే, దీనిపై క్లారిటీ మాత్రం రాలేదు.

క్రియేటివ్ డైరెక్టర్ కోసం రెడీ అవుతున్నాడు
ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు... క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో బన్నీ.. ఫుల్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్
మూడు సూపర్ హిట్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరోసారి నటించబోతున్నాడని తాజాగా ఓ వార్త లీక్ అయింది. అయితే, ఇది సినిమా కోసం మాత్రం కాదు. అల్లు అరవింద్ ప్రారంభించిన ‘ఆహా' అనే ఓటీటీ ఫ్లాట్‌ఫాం కోసం చేసే ప్రకటన మాత్రమే. తండ్రి కోరిక మేరకు అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

మహేశ్ బాబు, ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్
సినిమాలు మాత్రమే కాదు.. వ్యాపార ప్రకటనలతోనూ రాణిస్తున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆయన ఇప్పటికే మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు హీరోలతో కొన్ని యాడ్స్ రూపొందించారు. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే అల్లు అరవింద్ ఆయనకు అవకాశం ఇచ్చారని అంటున్నారు. ఈ యాడ్ షూటింగ్ రెండు రోజుల్లో ప్రారంభం కానుందని సమాచారం.
Recommended Video


ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకెళ్తున్నాడు
అల్లు అర్జున్‌తో ‘అల.. వైకుంఠపురములో' తీసి సక్సెస్ అయిన త్రివిక్రమ్.. తదుపరి ప్రాజెక్టును జూనియర్ ఎన్టీఆర్‌తో చేయబోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో తారక్ పొలిటిషియన్‌గా కనిపించబోతున్నాడని కూడా అంటున్నారు.


Click it and Unblock the Notifications











