కలగానే బన్నీ కోరిక.. అందని ద్రాక్షలా వ్యవహారం.. ఈసారైనా వర్కౌట్ అవుతుందా..?

టాలీవుడ్ హీరోలు పక్క భాషల ఇండస్ట్రీపై కన్నేయడం చాలా అరుదు. ఎందుకంటే మహామహులైన చిరు, వెంకీ, నాగ్ వల్లే కానీ వ్యవహారం అది. హిందీలో పలు చిత్రాలను చేసి చేతులు కాల్చుకున్నారు. అయితే ఇప్పటి హీరోలు సైతం అడపదడపా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలి వంటి జాతీయ చిత్రాలు రావడంతో మళ్లీ అందరిలోనూ ఆశలు చిగురిస్తున్నాయి. ఇండియన్ స్టార్‌గా ఎదిగే అవకాశముందని ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి.

సదరన్ స్టార్..

సదరన్ స్టార్..

ఆ క్రమంలోనే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే మలయాళంలో భారీ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకుని.. మంచి ఓపెనింగ్స్ రాబట్టే స్టేజ్‌కు ఎదిగాడు. దీంతో ఇప్పటి వరకు సదరన్ స్టార్‌గా బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు.

తమిళంలో మన హీరోలకు లేని పట్టు..

తమిళంలో మన హీరోలకు లేని పట్టు..

బన్నీకి ఎప్పటి నుంచో తమిళ మార్కెట్‌లోకి వెళ్లాలనే తపన వుంది. కేవలం బన్నీకే కాదు, మహేష్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. ఆ విషయంలో మహేష్‌కు స్పైడర్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ కూడా తగిలింది. విజయ్ సైతం నోటా, డియర్ కామ్రేడ్ అంటూ చేతులు కాల్చుకున్నాడు.

కొనసాగుతున్న ప్రయత్నాలు..

కొనసాగుతున్న ప్రయత్నాలు..

సరైన తెలుగు తమిళ ఉభయ భాషా చిత్రం చేసి, తమిళ నాట కూడా ఇంతో అంతో క్రేజ్ తెచ్చుకోవాలన్నది బన్నీ ఆలోచన. ఇది ఈనాటిది కాదు. ఏనాటి నుంచో నానుతూ వస్తోన్న విషయం. అయితే ఆ ప్రయత్నానికి అడుగు అడుగునా విఘ్నాలే ఎదురవుతున్నాయి.

ఓకే కాని ప్రాజెక్ట్స్..

ఓకే కాని ప్రాజెక్ట్స్..

గతంలో ఏకంగా ఒక సినిమాకు ఓపెనింగ్ కూడా తెగ హడావుడిగా చేసేసారు చెన్నయ్ లో. లింగుస్వామితో సినిమా చేయాలనుకున్నారు. ఆయన ఫ్లాపుల్లో ఇరుక్కుని, తమిళనాటే సరైన సినిమా లేకుండా వున్నారు. మురుగదాస్ తో సినిమా పక్కా అని ఆ మధ్య అనుకున్నారు. ఆ మధ్య దర్బార్ ప్రమోషన్ విషయంలోనూ బన్నీతో చేయబోవే చిత్రం గురించి వార్తలు వచ్చాయి. అయితే ఇది కూడా పట్టాలెక్కుతుందో లేదో తెలియని పరిస్థతి. మొత్తానికి బన్నీకి కోలీవుడ్ అనేది అందని ద్రాక్షలా మారిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి సుకుమార్, ఆ తరువాత వేణు శ్రీరామ్ లేదా సురేందర్ రెడ్డి అనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X