twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ... 'సన్నాఫ్‌ సత్యమూర్తి

    By Srikanya
    |

    హైదరాబాద్ :అల్లు అర్జున్‌ను తెరపై 'జులాయి'గా చూపించి ప్రేక్షకులకు వినోదాలు పంచారు త్రివిక్రమ్‌. ఆ ఇద్దరి కలయికలో ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతోంది. సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ కథానాయికలు. రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    త్రిశూలం, హుషారు, జాదూగర్ వంటి టైటిల్స్ పరిశీలనలకో వచ్చినా కథ ప్రకారం ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు, హీరో భావించినట్లు సమాచారం. మార్చి చివరలో కాని,ఏప్రియల్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం విడుదల అవనుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా పడుతుందని చెప్తున్నారు. తండ్రి కొడుకుల రిలేషన్ కూడా కథలో ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

    Allu Arjun -Trivikram film titled S/o Satya Murthy

    ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది.

    ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

    మరో ప్రక్క ఈ చిత్రం పూర్తవగానే మహేష్ ,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. జూలాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2015 ఆగస్టు నుంచి ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలు ఎక్కవచ్చు. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికి మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని ఫినిష్ చేసుకుని రెడీ అవుతారు.

    English summary
    Allu Arjun-Trivikram's upcoming flick has been titled as 'S/O Satyamurthy'.'S/O Satyamurthy' shooting has neared completion and it will release either by March end or April first half.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X