అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ అదేనా...?

By Nageswara Rao

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా "హనీ" అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. ఈ సినిమాని యూనివర్సల్ మీడియా పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య సినిమాని తీయబోతున్నారు. ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో "హనీ" అన్న పేరుని రిజిస్టర్ చేశారట. ఈ "హనీ" చిత్రానికి క్యాప్షన్ గా "హి ఈజ్ వెరీ స్వీట్" అని పెట్టడం జరిగిందంట.

మామూలుగా అమ్మాయిలను స్వీటీ అని పిలవటం సహజం కానీ ఒక అబ్బాయిని హనీ అని పిలవటం ఈ చిత్రంలో వెరైటీ అనీ ఈ చిత్రం యూనిట్ భావిస్తోందట. ఈ "హనీ" అనే పేరు హీరోకే అని ఎందుకనుకోవాల్సి వచ్చిందంటే ఈ చిత్రం క్యాప్షన్ గమనిస్తే మనకా విషయం అర్థమవుతుంది. ఈ "హనీ" చిత్రంలో ఇలియానా కానీ, సమంత కానీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X