బన్నీ- త్రివిక్రమ్‌కి టెన్షన్ పుట్టిస్తున్నారుగా! ఇదే జరిగితే..
'నా పేరు సూర్య' ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్రివిక్రమ్ సెట్స్‌పై పైకి వచ్చాడు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో బన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో యంగ్ హీరో సుశాంత్, మరో హీరోయిన్ నివేద పేతురేజ్ కూడా భాగమవుతున్నారని ఇటీవలే ప్రకటించారు యూనిట్ సభ్యులు. అల్లు అర్జున్ కెరీర్‌లో 19 వ సినిమాగా రానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకుంది ప్రేక్షకలోకం.
అయితే తాజాగా ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న ఓ వార్త బన్నీ, త్రివిక్రమ్ లతో పాటు వారి వారి అభిమానుల్లో కూడా టెన్షన్ పుట్టిస్తోంది. స్టార్ హీరోలతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ దాదాపుగా సూపర్ డూపర్ హిట్ సాధించడం, ఆ తరువాత అదే కాంబినేషన్ రిపీట్ కావడం చూస్తూనే ఉంటాం. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో ఇలా రిపీటెడ్ కాంబోలో సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ సినిమాలను ఉదాహరణగా తీసుకొని.. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాపై సందేశాలు వ్యక్తం చేస్తూ మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

మెగా కాంపౌండ్ హీరోల్లో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబోలో మూడు సినిమాలు వచ్చేశాయి. ఇప్పుడు బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో కూడా మూడో సినిమా తెరకెక్కుతోంది. అయితే పవన్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో ప్రాజెక్టు 'అజ్ఞాతవాసి' ప్లాప్ అయింది. గతంలో ఈ సినిమా సంక్రాంతి సీజన్‌లో విడుదలైంది. ఇప్పుడు అదే సంక్రాంతి సీజన్ లో అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూడో సినిమా విడుదల కానుండటంతో అప్పుడు కలిసి రానిది.. ఇప్పుడెలా కలిసొస్తుంది? అనే కోణంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. నిజానికి సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్ ప్రభావమనేది ఉంటుందని తెలుసు కానీ మరీ ఇంత లాజికల్ సెంటిమెంట్స్ కూడా ఉంటాయా? అనేది ఆసక్తికరంగా ఉంది.


Click it and Unblock the Notifications











