For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ - త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్.. దానికి మించి..

    |

    అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఎంత సక్సెస్‌ఫుల్ అయిందో అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి కలయికలో గతంలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ రెండింటి తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కూడా నటిస్తున్నాడు. అలాగే సీనియర్ నటి టబు దీని ద్వారా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్నప్పటి నుంచి ఎన్నో అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాలో నివేదా థామస్ నటిస్తోందని, అది కూడా బన్నీకి చెల్లెలిగా చేస్తుందని ఓ వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాలో నగ్మా నటిస్తుందని అన్నారు. రెండు రోజులుగా ఈ సినిమాలో ద్వారా సీనియర్ నటి సంగీత రీ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.

     Allu Arjun, Trivikram Srinivas Movie title fix

    తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా తండ్రి సెంటిమెంట్‌తో తెరకెక్కుతుందనేదే ఆ వార్త సారాంశం. తండ్రి కోసం బన్నీ ఓ త్యాగం చేస్తాడట. అందుకే ఈ సినిమా టైటిల్ కూడా 'నాన్న నేను' అని పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' కూడా తండ్రి సెంటిమెంట్‌తోనే వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతకు మించి ఉంటుందని అంటున్నారు. మరి, ఇది కూడా బన్నీకి సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.

    English summary
    Allu Arjun took his time to sign his next film. The actor seems to have gone on a break to make his decision about his future projects. Now, he is back on track with a film with ace director Trivikram Srinivas. This Movie Title Fix.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X