Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బన్నీ - త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్.. దానికి మించి..
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఎంత సక్సెస్ఫుల్ అయిందో అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి కలయికలో గతంలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ రెండింటి తర్వాత వీళ్ల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కూడా నటిస్తున్నాడు. అలాగే సీనియర్ నటి టబు దీని ద్వారా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్నప్పటి నుంచి ఎన్నో అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాలో నివేదా థామస్ నటిస్తోందని, అది కూడా బన్నీకి చెల్లెలిగా చేస్తుందని ఓ వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాలో నగ్మా నటిస్తుందని అన్నారు. రెండు రోజులుగా ఈ సినిమాలో ద్వారా సీనియర్ నటి సంగీత రీ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా తండ్రి సెంటిమెంట్‌తో తెరకెక్కుతుందనేదే ఆ వార్త సారాంశం. తండ్రి కోసం బన్నీ ఓ త్యాగం చేస్తాడట. అందుకే ఈ సినిమా టైటిల్ కూడా 'నాన్న నేను' అని పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' కూడా తండ్రి సెంటిమెంట్‌తోనే వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతకు మించి ఉంటుందని అంటున్నారు. మరి, ఇది కూడా బన్నీకి సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.