అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ స్టోరీ లీక్.. ఎక్కడో చూసినట్లు ఉందే.!

Recommended Video

Allu Arjun's Ala Vaikuntapuram Lo Story Out | ‘అల.. వైకుంఠపురములో టీజర్ ఎప్పుడంటే

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచేశాడు. 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న బన్నీ.. ఇకపై వేగంగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో..' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..?

వైకుంఠపురములో ఫ్యామిలీ డ్రామా

వైకుంఠపురములో ఫ్యామిలీ డ్రామా

రెండు సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘అల.. వైకుంఠపురములో' విషయంలో యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అదిరిపోయే ఫ్యామిలీ డ్రామాను రాశాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన డైలాగులు ప్రధానాకర్షణ కానున్నాయని టాక్.

అక్కడ కూడా రిలీజ్

అక్కడ కూడా రిలీజ్

ఎంతో ప్రతిష్టాత్మక వస్తున్న ఈ సినిమాను కేరళలో కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది. అయితే, ఇది తెలుగులో మాత్రం కాదు. మలయాళంలోకి ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారట. అక్కడ బన్నీకి భారీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను ‘అంగు.. వైకుంతపురతు' అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తారని వినికిడి.

టీజర్ డేట్ ఫిక్స్

టీజర్ డేట్ ఫిక్స్

ఇటీవల ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదే.. ఈ సినిమా టీజర్ గురించి. ‘అల.. వైకుంఠపురములో' టీజర్ నవంబర్ 7న విడుదల కానుందట. ఆరోజు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు. కాబట్టి దీన్ని పురస్కరించుకుని ఆయన బన్నీ అభిమానులకు సర్‌ప్రైజ్ గిప్ట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ వార్త తాజాగా బయటకు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

 స్టోరీ లీక్ అంటూ వార్తలు

స్టోరీ లీక్ అంటూ వార్తలు

తాజాగా ఈ సినిమా కథ లీక్ అయిందంటూ ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఒక ధనవంతుడు.. మరో ట్యాక్సీ డ్రైవర్ స్నేహితులు. వీళ్ల పిల్లలను చిన్నప్పుడే మార్చుకుంటారు. ధనవంతుడి కుమారుడైన బన్నీ అసలు విషయం తెలుసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్లాలనుకుంటాడు. అయితే, అక్కడే ఉన్న ట్యాక్సీ డ్రైవర్ కొడుకు సుశాంత్ మాత్రం తన తండ్రి దగ్గరకు వెళ్లనంటాడు. అదే సమయంలో నవదీప్ షాకింగ్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఇంతకీ ఎవరి కొడుకు ఎవరు..? నవదీప్ ఎవరు..? అనేది తెరపైనే చూడాలి.

‘అల.. వైకుంఠపురములో' విషయానికొస్తే..

‘అల.. వైకుంఠపురములో' విషయానికొస్తే..

‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా పేతురాజ్, నవదీప్ తదితర నటులు కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X