ఫ్లాప్ డైరక్టర్ కి అల్లు అర్జున్ ఛాన్స్
హైదరాబాద్ : రేసు గుర్రం విజయంతో ఉత్సాహంగా ఉన్న అల్లు అర్జున్ తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. సిద్దార్ధ,శృతి హాసన్ కాంబినేషన్ లో రూపొందిన ఓ మై ప్రెండ్ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఆయన చిత్రం చేయనున్నారని సమాచారం. ఓ మై ప్రెండ్ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది. అయినా అతనిలో టాలెంట్ ఉన్నదని గమనించిన అల్లు అర్జున్ అతనికి ఛాన్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు వెనక దిల్ రాజు ఉండటమే ఓకే కావటానికి కారణం అంటన్నారు.
దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం ఓ లవ్ స్టోరీగా ఉండనుందని,వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో వేణు శ్రీరామ్ కథనాన్ని తయారు చేసాడని చెప్తున్నారు. ఈ మేరకు గత కొంతకాలంగా వేణు ఈ స్క్రిప్టుపైనే కుస్తీలు పడుతున్నారు. లైన్ ఓకే చేసిన బన్ని రీసెంట్ గా పూర్తి స్క్రిప్టు విన్నారని, తెలుస్తోంది. త్రివిక్రమ్ తో చేయనున్న ప్రాజెక్టు అనంతరం ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. వేణు శ్రీరామ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న కేరింత చిత్రంకి సహాయం చేస్తున్నారు.

'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్ ...అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు పూజా కార్యక్రమాలు జరిగాయి. 'జులాయి' తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తూండటంతో అంతటా ఓ రేంజి లో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఈ నెల్లో గ్రాండ్ గా సిని పెద్దల సమక్షంలో లాంచ్ చేయటానికి నిర్మాత రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పవన్ కొత్త పార్టీ పెడుతూ జనం మధ్యకు వస్తూండటంతో త్రివిక్రమ్ ఆ వ్యవహారాల్లో పూర్తి బిజీ అయ్యిపోయారు. ఈ నేపధ్యంలో బన్నీ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
రేసు గుర్రం తర్వాత గోపీచంద్ మలినేనితో పండుగ చేస్కో చిత్రం చేయటానికి స్క్రిప్టు వర్క్ జరిగింది. అయితే త్రివిక్రమ్ తో ఓకే చేయటంతో అదిప్పుడు రామ్ దగ్గరకి వెళ్లింది. అటు హరీష్ శంకర్ చిత్రమూ రిజెక్టు చేసారు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ చిత్రం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్. అయితే ఎలక్షన్స్ అయ్యేదాకా త్రివిక్రమ్ ఖాళీ పడలేదు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకొంటున్నారు.
దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇదివరకు 'జులాయి'కి కూడా ఈయనే స్వరాలు సమకూర్చారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కబోతోంది. ఇందులో అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరినట్టు సమాచారమ్. మరో ప్రక్క అల్లుఅర్జున్ 'రేసుగుర్రం' రీసెంట్ గా రిలీజయ్యి సూపర్ హిట్టైంది.


Click it and Unblock the Notifications











