పవన్‌పై ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్.. సక్సెస్ అయితే వెంటనే కలుస్తాడట.!

By Manoj Kumar P

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించనప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తక్కవ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయిన ఆయన... అన్న చూపించిన బాటలోనే నడుస్తున్నాడు. ఇందులో భాగంగానే రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇక, ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు పవన్. ఆయన కమ్‌బ్యాక్ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇదే సినిమాపై అల్లు అర్జున్ కూడా ఫోకస్ చేశాడట. ఇంతకీ బన్నీ ప్లాన్ ఏంటో తెలుసా.?

రాజకీయాల నుంచి నేరుగా కోర్టులోకే

రాజకీయాల నుంచి నేరుగా కోర్టులోకే

రాజకీయాల కోసం సినిమాలకు దూరం అయ్యాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్' అనే సినిమా ద్వారా అతడు మరోసారి ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ‘పింక్'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆ రికార్డులు పవన్ క్రేజ్‌కు నిదర్శనం

ఆ రికార్డులు పవన్ క్రేజ్‌కు నిదర్శనం

చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో ‘వకీల్ సాబ్'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొద్ది రోజుల క్రితం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ‘మగువా మగువా' అని సాగే పాట విడుదలైంది. ఈ రెండింటికీ భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపణ అయింది.

దూకుడుగా పవర్ స్టార్.. మరో ఇద్దరితో

దూకుడుగా పవర్ స్టార్.. మరో ఇద్దరితో

రీఎంట్రీలో దూకుడు చూపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే ‘వకీల్ సాబ్' మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన... మరో ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వారిలో ఒకరు క్రిష్ జాగర్లమూడి కాగా, రెండోది హరీశ్ శంకర్. వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

పవన్‌పై ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్

పవన్‌పై ఆశలు పెట్టుకున్న అల్లు అర్జున్

చాలా రోజుల తర్వాత సినిమాల్లో నటిస్తున్నాడు పవన్ కల్యాణ్. దీంతో మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఆయన కమ్‌బ్యాక్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సున్నా.. కరోనా ప్రభావంతో వాయిదా పడిపోయింది. ఈ మూవీపైన అల్లు అర్జున్ కూడా ఆశలు పెట్టుకున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

రీఎంట్రీ సక్సెస్ అయితేనే కలుస్తాడట.!

రీఎంట్రీ సక్సెస్ అయితేనే కలుస్తాడట.!

‘వకీల్ సాబ్' దర్శకుడు వేణు శ్రీరామ్... దీని కంటే ముందే దిల్ రాజు బ్యానర్‌లో అల్లు అర్జున్‌తో ‘ఐకాన్' అనే సినిమాను ప్రకటించాడు. కానీ, బన్నీ మాత్రం దానిని పక్కన పెట్టేశాడు. ఈ క్రమంలోనే ‘అల.. వైకుంఠపురములో' చేసి, ఇప్పుడు ‘పుష్ప'లో నటిస్తున్నాడు. పవన్ సినిమా హిట్ అయితే.. వెంటనే ‘ఐకాన్'ను పట్టాలెక్కించాలని అతడు నిర్ణయించుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.

Recommended Video

Shruti Haasan Demands Huge Remuneration For Pawan Kalyan's Movie
కలప స్మగ్లింగ్ చేస్తున్న అల్లు అర్జున్

కలప స్మగ్లింగ్ చేస్తున్న అల్లు అర్జున్

‘అల.. వైకుంఠపురములో' హిట్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్. ఆ ఉత్సాహంతోనే సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బన్నీ గంథపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించబోతున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తుండగా, నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X