బన్నీని నిరాశపరిచిన క్రేజీ దర్శకుడు.. అలాంటి సినిమా కావాలని!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నా పేరు సూర్య చిత్రంలో ఫ్యాన్స్ ని పలకరించాడు. నా పేరు సూర్య చిత్రం బన్నీ వరుస విజయాలకు అడ్డు కట్ట వేసింది. సరైనోడు, డీజే వంటి మాస్ హిట్స్ దక్కించుకున్న బన్నీ నా పేరు సూర్య చిత్రంతో మెప్పించలేకపోయాడు. ఈ సారి ఎలాగైనా బలమైన కథతో హిట్టు కొట్టాలని బన్నీ బావిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్స్ అంతా వారి చిత్రాలతో బిజీగా ఉండడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ దొరకడం కష్టంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. తన వద్దకు వచ్చిన అందరి దర్శకుల కథలు అల్లు అర్జున్ వింటున్నాడట.

కష్టపడి చేసినా
నా పేరు సూర్య చిత్రం కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు. బన్నీ కష్టం వెండి తెరపై కనిపించింది. ఆర్మీ మాన్ గా మేకోవర్, లుక్ విషయంలో బన్నీ ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాడు. కానీ కథలో బలం లోపించడంతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది.

మంచి కథ కోసం
అల్లు అర్జున్ తన తదుపరి చిత్ర దర్శకుడు, కథ కోసం ఎదురుచూస్తున్నాడు. తనవద్దకు వచ్చిన దర్శకులందరి కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ఏ స్టోరీతోనూ బన్నీ ఇంప్రెస్ కాలేదు.

నిరాశపరిచిన క్రేజీ దర్శకుడు
క్రేజీ దర్శకుడు విక్రమ్ కుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. తాజగా అందుతున్న సమాచారం ప్రకారం విక్రమ్ కుమార్ ఇటీవల బన్నీని కలసి స్క్రిప్ట్ వివరించాడట. కానీ సెకండ్ హాఫ్ పట్ల బన్నీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాంటి సినిమా కోసం
ఇటీవల స్టార్ హీరోల చిత్రాలన్నీఓవర్సీస్ మార్కెట్ లో దుమ్మురేపుతున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ చిత్రాలు మాత్రం ఓవర్సీస్ లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ సారి తాను చేయబోయే చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉండాలని బన్నీ భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











