Just In
- 35 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 42 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 1 hr ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 1 hr ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
Don't Miss!
- News
దారుణం.. దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారు... షాకింగ్ వీడియో..
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్ టాపిక్: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం.. అల్లు ప్రపోజల్ పక్కన పెట్టేసిన స్టార్ డైరెక్టర్.!
యాక్టింగ్, డ్యాన్స్, స్టైల్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మెగా కాంపౌండ్‌కు చెందిన హీరోనే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా బన్నీ తెలుగు ప్రేక్షకులకు ఎన్నో స్టైల్స్ పరిచయం చేయడంతో యూత్ ఐకాన్‌గా మారాడు. ఇక, ఇటీవల భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ అల్లు వారి అబ్బాయి.. సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరిపాడట. ఇంతకీ ఏంటా సినిమా.? వివరాల్లోకి వెళితే....

గురూజీతో కలిసిన అల్లు అర్జున్.. హ్యాట్రిక్ కొట్టాడు
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘నా పేరు సూర్య' పరాజయాన్ని చవి చూసింది. ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత అతడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, ‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత వీళ్ల కాంబోలో హ్యాట్రిక్ నమోదైంది.

నాన్ బాహుబలి రికార్డును కొట్టేసిన స్టైలిష్ స్టార్
‘అల.. వైకుంఠపురములో' సూపర్ హిట్ అవడం మాత్రమే కాదు.. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా దుమ్ము దులిపేసింది. సంక్రాంతికి మహేశ్ సినిమా నుంచి భారీ పోటీని తట్టుకుని మరీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు రాబట్టింది. దీంతో ‘బాహుబలి' తర్వాత భారీ స్థాయిలో వసూళ్ల సాధించిన చిత్రంగా నిలిచింది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా 3.5 మిలియన్ మార్కును దాటేయడం విశేషం.

వాళ్లందరినీ గుర్తు పెట్టుకున్న అల్లు హీరో
సంక్రాంతికి మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా ఉన్నప్పటీ.. ‘అల.. వైకుంఠపురములో' భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన బన్నీ.. ఇండస్ట్రీలోని డైరెక్టర్లందరికీ పార్టీ ఇచ్చాడు. అలాగే, సినిమా జర్నలిస్టులకు ప్రత్యేంగా విరాళం అందించాడు. డిస్ట్రిబ్యూటర్లకు సైతం విందు ఇచ్చాడు.

హిట్ సినిమాకు సీక్వెల్ కోసం బన్నీ ప్రయత్నం
త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అల.. వైకుంఠపురములో' సూపర్ హిట్ అవడంతో.. అల్లు అర్జున్ ఈ సినిమాకు సీక్వెల్ చేసే ప్రయత్నాలు చేశాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకు కొనసాగింపుగా కథను అల్లే అవకాశాలు మెండుగా ఉండడం వల్లే అతడు ఆ దిశగా ఆలోచన చేశాడని అంటున్నారు. ఈ విషయంపై త్రివిక్రమ్‌తో కూడా బన్నీ చర్చించాడని సమాచారం.

సున్నితంగా తిరస్కరించిన డైరెక్టర్.. కారణమిదే
‘అల.. వైకుంఠపురములో'కు సీక్వెల్ తీద్దామని బన్నీ పెట్టిన ప్రపోజల్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ సున్నితంగా తిరస్కరించాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆయన భవిష్యత్‌లో తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్‌తో సినిమాలు చేయాల్సి ఉండడమేనని ఇండస్ట్రీలోని కొందరు అంటున్నారు. అంటే బన్నీ ప్రపోజల్ పట్టాలెక్కదన్న మాట.

ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి దింపుతున్నాడు
అల్లు అర్జున్‌తో చేసిన సినిమా సూపర్ సక్సెస్ అవడంతో త్రివిక్రమ్.. తన తదుపరి ప్రాజెక్టును జూనియర్ ఎన్టీఆర్‌తో చేస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె.. హస్తినకు' అనే టైటిల్ అనుకుంటున్నారని తెలిసింది. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ అని అంటున్నారు.