అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ కోరిక ఎప్పటికి తీరేనూ...!?
ఇప్పుడున్న మన యంగ్ బ్యాచ్ హీరోలలో డ్యాన్సులు బాగా చేయగలిగే వాళ్లల్లో అల్లు అర్జున్ ముందువరసలో ఉంటాడు. టాలీవుడ్ లో ఇప్పుడున్న కుర్ర హీరోల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎంత మంచి డాన్సర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిత్రంలోనూ ఏదో ఓ కొత్త స్టెప్ తో ప్రేక్షకులు ముందుకు రావాలని ప్రయత్నిస్తుంటారు వీరు. 'యమదొంగ'లో ఎన్టీఆర్ అదుర్స్ అనిపించుకుంటే, 'మగధీర'లో రామ్ చరణ్ డాన్స్ 'ధీర' అనిపించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా గంగోత్రి తో కెరీర్ ప్రారంభించి, హ్యాపీ, దేశముదురు, ఆర్య2, వంటి చిత్రాల్లో తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు.
డ్యాన్స్ మాస్టర్ ఎలాంటి క్లిష్టమైన మూమెంట్స్ కంపోజ్ చేసినా, అల్లు అర్జున్ చాలా ఈజీగా చేసేస్తాడని పేరుంది. అలాంటి ఈ డ్యాన్సింగ్ సెన్సేషన్ కి ఓ బలీయమైన కోరిక వుంది. అదేమిటంటే, నృత్య ప్రధానమైన ఓ చిత్రంలో నటించాలనేది మనవాడి కోరికట. అయితే, అల్లు అర్జున్ భుజానికి సర్జరీ చేయించుకోవడానికి పెర్త్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇటీవలే భుజానికి ఆపరేషన్ చేయించుకున్నందువల్ల ఆ గాయం పూర్తిగా మానిన తర్వాతే అటువంటి చిత్రం గురించి ఆలోచిస్తాననీ, తప్పకుండా డ్యాన్స్ ఓరిఎంటేడ్ ఫిలిం మాత్రం చేస్తాననీ చెబుతున్నాడు. త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందే సినిమా షూటింగులో అర్జున్ పాల్గొంటాడు.


Click it and Unblock the Notifications











