వీరరాఘవ జోరు.. ముచ్చటగా మూడో సినిమాపై త్రివిక్రమ్ గురి!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరరాఘవుడిగా బాక్సాఫీస్ వద్ద విధ్వంసాలు మొదలుపెట్టాడు. అరవింద సమేత చిత్రం తిరులేని పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అజ్ఞాతవాసి పరాజయం నుంచి తేరుకున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేసి విజయాన్ని అందుకున్నాడు. రికార్డులన్నీ తుడిచి పెట్టేవరకు అరవింద సమేత జోరు తగ్గేలా లేదు. అరవింద సమేత చిత్రంతో త్రివిక్రమ్ కేంద్రంగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

తదుపరి చిత్రం ఎవరితో
ఈ ఏడాది ఆరంభంలో అజ్ఞాతవాసి చిత్రంతో పరాజయం చవిచూసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజగా అరవింద సమేతతో తన సత్తా మరోమారు నిరూపించుకున్నాడు. ఘనవిజయం దిశగా అరవింద సమేత చిత్రం దూసుకుపోతోంది. ఇక త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఏంటనే దానిపై చర్చ మొదలైంది.

ఖాళీగా లేని స్టార్స్
త్రివిక్రమ్ చిత్రాలు స్టార్ హీరోలతోనే ఉంటాయి. మహేష్, రాంచరణ్, ప్రభాస్ వంటి హీరోలంతా వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒక్క అల్లు అర్జున్ తప్ప. నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. మంచి కథ, దర్శకుడి కోసమే బన్నీ ఎదురుచూపులు.

విక్రమ్ కుమార్‌కు నో
బన్నీ నెక్స్ట్ మూవీ విక్రమ్ కుమార్ తో ఉంటుందని వార్తలు బలంగా వినిపించాయి. కానీ కథ పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా లేకపోవడంతో అల్లు అర్జున్, విక్రమ్ కుమార్ ప్రోజెక్ట్ సైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. దీనితో బన్నీ తనకు అచ్చొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం ఎదురుచూస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వచ్చాయి.

ముచ్చటగా మూడోసారి
బన్నీ తప్ప మరో స్టార్ హీరో ఖాళీగా లేని నేపథ్యంలో త్రివిక్రమ్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. ఈ కాంబినేషన్ సెట్ అయితే త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వస్తున్న మూడో చిత్రం అవుతుంది. గతంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











