twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ఒకేసారి రెండు ఫినిష్ చేస్తాడు (ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : తన డాన్స్ లతో యూత్ ఐకాన్ గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం' షూటింగులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఒకేసారి రెండు సినిమాలు చేయాలనే ఆలోచనల ఉన్నాడని తాజా సమాచారం. ఈ సిక్స్ ప్యాక్ హీరో తన తోటి హీరోలకు పోటీ ఇచ్చే విధంగా ...కెరీర్‌ స్పీడును పెంచాలని నిర్ణయించుకున్నాడట. అందులో భాగంగానే వరుస షూటింగులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేస్తున్నాడు.

    సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న రేసుగుర్రం .. ఇలా పూర్తికాగానే మరో రెండు సినిమాల్లో నటించడానికి రంగం సిద్ధం చేసేశాడట. 'బలుపు' ఫేం గోపిచం ద్‌ మలినేని దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించే సినిమాతో పాటు .. 'గబ్బర్‌సింగ్‌' ఫేం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలోనూ సినిమా చేయనున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు ఒకేసారి సెట్స్‌కెళతాయని సమాచారం. ఇలా చేయటం వల్ల తన సినిమాలకు గ్యాప్ ఎక్కువ రాదని బన్ని అభిప్రాయపడుతున్నాడని తెలుస్తోంది.

    అల్లు అర్జున్‌, కిక్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతున్న 'రేసు గుర్రం' గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటం, స్క్రిప్టు పక్కాగా పూర్తి చేయటం కూడా లేటు చేసారు. ఇప్పుడు రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది.

    'రేసుగుర్రం' విశేషాలు స్లైడ్ షో లో...

    టైటిల్ అందుకే..

    టైటిల్ అందుకే..

    ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    కొత్త స్టైల్

    కొత్త స్టైల్

    బన్నీ, శృతిహాసన్‌లపై రెండు పాటలను, మరికొన్ని కీలక సన్నివేశాలను నార్వేలో చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ చేసి, బన్నీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రం నిర్మించనున్నారని సమాచారం. బన్నీ ఈ చిత్రంలో సరికొత్త స్టయిల్లో కనిపించనున్నారని, అతని గెటప్ అంతా మార్చివేసి నిర్మిస్తున్నారని వినికిడి.

    యాక్షన్ లవ్ స్టోరీ..

    యాక్షన్ లవ్ స్టోరీ..

    సురేంద్ర రెడ్డి గత చిత్రాల తరహాలో ఈ సినిమా ట్విస్ట్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని తెలుస్తోంది. అల్లు అర్జున్ సైతం ప్రత్యేక శ్రద్ద పెట్టి ఈ చిత్రం తో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పూర్తి దృష్టి పెట్టి చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

    హిట్ అవసరం

    హిట్ అవసరం

    సురేంద్ర రెడ్డికి ఊసరవెల్లి చిత్రంతో ప్లాప్ వచ్చింది. అల్లు అర్జున్ కు ఇద్దరమ్మాయిలతో చిత్రం నిరాసనే మిగిల్చింది. ఈ నేపధ్యంలో ఇద్దరికీ హిట్ అవసరమైంది. దాంతో ఇద్దరూ స్క్రిప్టునే నమ్మకుని వెళ్తున్నట్లు చెప్తున్నారు. అలాగే చిత్రం పూర్తి స్టైలిష్ గా ప్లాన్ చేసారని, ప్రీ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని, అది సినిమాకు హైలెట్ అవుతుందని వినికిడి.

    నో పబ్లిసిటీ..

    నో పబ్లిసిటీ..

    మీడియాకు ఈ చిత్రం గురించి పెద్దగా వివరాలు ఇవ్వటం లేదు. అలాగే టైటిల్ సైతం ఖరారు చేయలేదు. నల్లమలుపు శ్రీనివాస్, డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రేసుగుర్రం టైటిల్ వ్యవహారంలో ఉంది కానీ అధికారికంగా ప్రకటించలేదు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మీడియా కన్నును కప్పి తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. తర్వాత షెడ్యూల్‌కు నార్వే కు వెళ్లారు.

    English summary
    Allu Arjun and Shruti Haasan’s upcoming film Race Gurram is being shot in the locales of Milan. The film was recently shot in the beautiful locales of Geneva.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X