బన్నీ‘బద్రినాథ్’తో కూష్మాండం బద్దలయ్యేనా...
సాధారణంగా చిన్న సినిమాలు చేస్తే చిన్న హీరోలుగా మిగిలిపోతామేమో అన్న భయం ప్రతి నటునిలోనూ ఉంటుంది. అందునా ఓ వైపు రామ్ చరణ్ 'మగధీర"తో ఎవరెస్ట్ శిఖరం పైనెక్కి కూర్చుంటే తోటివాడైన అల్లు అర్జున్ ఊరికే ఉండలేక తండ్రి అరవింద్ తో 'బద్రినాథ్"బండి కట్టించాడు. కొడుకుకు సరికొత్త స్టార్ ఇమేజ్ సాధించి పెట్టాలన్న కసితో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఇప్పుడు మార్కెట్ లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా, ఇంకెప్పుడు బన్నీ డ్యాన్సులు చూద్దామా అనుకుంటున్న అభిమానులకు మరి కూష్మాండం బద్దలవనుందా లేక 'మగధీర" లాంటి రికార్డులు విరగనున్నాయా అంటే జూన్ పది వరకు వేచి చూడాల్సిందే..మొత్తంగా 'బద్రినాథ్" సృష్టించబోతున్న అసలు సిసలైన సంచలనాలకు ఇక రెడీ అయిపోయింది...
allu arjun tamanna badrinath vv vinayak allu aravind magadheera అల్లు అర్జున్ తమన్నా బద్రినాథ్ వివి వినాయక్ అల్లు అరవింద్ మగధీర


Click it and Unblock the Notifications