»   » ఆమే కావాలంటూ అల్లు అర్జున్ పట్టు

ఆమే కావాలంటూ అల్లు అర్జున్ పట్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా వద్దు.. సమంతానే ముద్దు అనే పాట పాడుతున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ తో తాను చేయనున్న చిత్రంలో ఇలియానాని ఎంపిక చేయటం అల్లు అర్జున్ కి సుతరామూ ఇష్టం లేదు. కానీ త్రివిక్రమ్ కి జల్సా టైమ్ లో అయిన ఆ పరిచయాన్ని కొనసాగించాలనే అలోచన ఉంది. దానికి నిర్మాత డివివి దానయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వేషాలు లేక ఇలియానా కూడ రేటు తగ్గించుకుని ప్రాజెక్టు ఓకే చేసుకుంది. అయితే మహేష్ దూకుడులో చేసిన ఆమెకు వచ్చిన క్రేజ్ కు ముచ్చడ పడ్డ బన్నీ ఆమెనే కావాలని పట్టుబడుతున్నారు.

ఇలియానాకు ఇచ్చిన అడ్వాన్స్ ను తాను తన మొత్తంలో తగ్గించుకుంటాను అని కూడా చెప్తున్నాడు. అంతేగాక ఇలియానా చేసేన సినిమాలు ఏవి హిట్టు ఈ మధ్య కాలంలో చెప్పమంటున్నారు. అయితే నిర్మాతలు ఆ మాట కొస్తే అల్లు అర్జున్ చేసిన సినిమాలు కూడా హిట్టు లేవి లేవు కదా ఈ మధ్యన అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం మీ ఇష్టం నా ఆప్షన్ ఇలియానా అని చెప్పాను.. మీరు సమంతను తీసుకు వస్తే ఆమెతోనే చేయించుకుంటా అని తెలివిగా తప్పుకున్నాడు. అయితే సమంత డేట్స్ మాత్రం ఇప్పుడు ఎంతవరకూ దొరుకుతాయనేదే ఇప్పుడు సమస్యగా మారింది. సాధారణంగా హీరో మాటే ఫైనల్ కాబట్టి సమంతనే తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.

English summary
Allu Arjun is firm on his decision to replace Ileana. He asked Trivikram to consider Samantha, citing the reasons that their pair would look good onscreen and the less pay package of the actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu