ఎవరు పూర్తిగా తృప్తి పరుస్తారో వారితోనే అల్లు అర్జున్
ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ పైనే ఉంది. ఆస్ట్రేలియీలో సర్జరీ చేయించుకు వచ్చిన అల్లు అర్జున్ తదుపరి ఏ చిత్రంలో చేస్తారనేదే హాట్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చిత్రం చేస్తాడని ఓ ప్రక్కన వినిపిస్తూంటే మరో ప్రక్కన అదేం లేదు వాసు వర్మ డైరక్షన్ లోనే చేస్తాడంటున్నారు. దిల్ రాజు నిర్మించే చిత్రమే మొదట మొదలవుతుందని అంటున్నారు. అయితే ఈ విషయమై అల్లు అర్జున్ ఈ విషయమై తన మనస్సలో ఏముందో మాత్రం బయిట పెట్టడం లేదు. మరో ప్రక్క అల్లు అర్జన్ చాలా తన తదుపరి చిత్రం ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు.దానికి కారణం ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో చేసిన బద్రీనాధ్ ప్లాప్ కావటమే. అంతకుముందు వచ్చిన వరుడు చిత్రం కూడా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం అతన్ని ఆలోచనలో పడేస్తోంది. దాంతో ఎవరు స్క్రిప్టు పూర్తిగా తృప్తి పరుస్తారో వారికే డేట్స్ అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. దాంతో త్రివిక్రమ్ కి కొంత బాధ కలిగించినా అతని ఖలేజా చిత్రం ఆడకపోవటం మైనస్ గా మారి అల్లు అర్జున్ నే అంటిపెట్టుకోవాల్సిన సిట్యువేషన్.


Click it and Unblock the Notifications











