»   » అల్లు అర్జున్‌ను ఇంకా అలానే ఇబ్బంది పెడుతున్న పవన్ ఫ్యాన్స్!

అల్లు అర్జున్‌ను ఇంకా అలానే ఇబ్బంది పెడుతున్న పవన్ ఫ్యాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య కొంత కాలంగా ఓ వివాదాస్పద వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహమే. పవర్ స్టార్‌కు సంబంధం లేని పంక్షన్లలో కూడా వారు పవర్ స్టార్, పవర్ స్టార్ అంటూ అరూస్తూ... ఆయా ఫంక్షన్లు సజావుగా సాగకుండా చేయడమే.

ఇక పవన్ కళ్యాణ్ అభిమానులతో.... అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' వివాదం అందరికీ తెలిసిందే. తర్వాత బన్నీ ఓసారి సమయం చూసి పవన్ కళ్యాణ్ అభిమానులకు గట్టిగానే క్లాస్ పీకాడారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మార్పు మాత్రం రావడం లేదని తెలుస్తోంది. అదరూ అలాంటి వారు కాక పోయినా కొందరు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు.

ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన మరో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అల్లు అర్జున్ హాజరు కాగా..... కారులో నుండి బన్నీ దిగగానే ఆయన దగ్గరకు వెళ్లిన కొందరు పవన్ ఫ్యాన్స్ అడ్డుపడి...... పవర్‌స్టార్ అంటూ నినాదాలు చేసినట్లు సమాచారం. తనను అడ్డగించి పవన్ అభిమానులు నినాదాలు చేస్తున్నా అల్లు అర్జున్ చిరు నవ్వుతో చూస్తూ ఉండిపోయారని, పోలీసులు అక్కడికి చేరుకుని జోక్యం చేసుకోవని బన్నీని అక్కడి నుండి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

మొత్తానికి చిరంజీవి 150వ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఊహిచని అభిమాన సందోహంతో గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో పాటు.... నాగబాబు కామెంట్స్, పవన్ కళ్యాణ్ హాజరుకాని ఇష్యూ, ఆయన అభిమానులు అల్లు అర్జున్‌ను అడ్డంగించడం లాంటి కొన్ని కంట్రవర్సీలకు కేంద్రమైంది.

English summary
Allu Arjun was stopped by pawan kalyan fans at khaidi no 150 pre release event. Check out details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X