Sneha Reddy: సినిమా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ భార్య.. తెలుగులో కాకుండా అక్కడ ఫస్ట్ ఛాన్స్?
అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. కూడా పర్సనల్ లైఫ్ కు వచ్చేసరికి మాత్రం బన్నీ చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను ఒక మంచి ఫ్యామిలీ మెన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని ఫోటోలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. అది కూడా తెలుగు ఇండస్ట్రీలో కాదని తెలుస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ హీరోగా
అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ లైఫ్ కు కూడా సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన పిల్లలతో బన్నీ వీలైనంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఎక్కువగా అల్లు స్నేహారెడ్డి తన ఫ్యామిలీ క్యూట్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఇద్దరు పిల్లలకు తల్లి అయినా
మొదట్లో అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పెద్దగా హడావిడిగా కనిపించేవారు కాదు. కానీ కొన్నాళ్ల తర్వాత ఆమె ఒక్కసారిగా ఊహించని విధంగా మారిపోయారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా హీరోయిన్స్ తరహాలో చాలా అందంగా కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అల్లు స్నేహ రెడ్డి స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా షాక్ ఇస్తూ ఉంటారు.

ఖరీదైన చీరతో వైరల్
స్నేహ రెడ్డి ఇటీవల ఒక సిల్వర్ చీరలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాని ఖరీదు దాదాపు లక్షకు పైగానే ఉంటుంది అని సోషల్ మీడియాలో కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఆ ఒక్క ఫోటో ద్వారా ఆమె తన సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్యను కూడా అమితంగా పెంచేసుకుంది.

నటిగా స్ స్నేహ రెడ్డి
ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ కరమైతే అల్లు స్నేహ రెడ్డి సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆమెను నటిగా చూడాలని అనుకుంటున్నాడట. ఇప్పటివరకు ఎవరు కూడా ఈ విషయంపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ స్నేహారెడ్డి నటన పై కొంత ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె విన్నపాన్ని అంగీకరించిన అల్లుఅర్జున్ భార్యను సినిమా ఇండస్ట్రీలోకి రప్పించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ ఇండస్ట్రీలో ఛాన్స్
అయితే అల్లు స్నేహారెడ్డి తెలుగు ఇండస్ట్రీలో కాకుండా మలయాళం సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మలయాళం లో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. అక్కడ అతను స్టార్ హీరోల రేంజ్ లోనే కలెక్షన్స్ అందుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు అల్లు స్నేహారెడ్డికి ఒక ప్రముఖ హీరో సినిమాలో మంచి పాత్ర లభించడంతో చేయడానికి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











