Allu Arjun Wife Sneha Reddy: బన్నీ భార్యకు ఆ సినిమాలో హీరోకున్న జబ్బు ఉందా?
ఈ మధ్య స్టార్ సెలబ్రెటీస్... చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. భయంకరమైన వ్యాధులు ఉన్నట్లు బయటకు వస్తున్నాయి. ఆ మధ్య హీరోయిన్ సమంత మయోటైటిస్ తో బాధపడుతున్నట్లు చెప్పి.. అభిమానులకు షాక్ ఇచ్చింది. తను ఎంత సఫర్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఈ భామ. అయితే బన్నీ భార్య స్నేహలతకు హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమెకు ఓ వ్యాధి ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వ్యాధి గురించి తెలిసి.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు : ఆ మధ్య స్టార్ హీరోయిన్ సమంత మయోటైటిస్ తో బాధ పడుతున్నట్లు చెప్పి.. అందరినీ షాక్ కు గురిచేసింది. ఆ వ్యాధి వల్ల ఆమె ఎంత సఫర్ అయిందో అంతా చూశాం. ఇక ఆ తర్వాత కూడా చాలా మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు రోజూ చదవుతునే ఉన్నాం. స్టార్ హీరోయిన్, స్టార్ హీరోలు.. ఎంతో మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. అలా ఇప్పుడు బన్నీ భార్య స్నేహ రెడ్డి గురించి కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ : బన్నీ భార్య స్నేహ రెడ్డికి హీరోయిన్ కు మించిన అందం ఉంటుంది. అంతే కాదు ఆమెకు.. హీరోయిన్ కు ఉన్న క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అల్లు అర్జున్ ఫోటోస్, వీడియోస్ తో పాటు.. అటు కూతురు అర్హ, కొడుకు ఆయన్ ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా అర్హ చేసే పనులు, అర్హ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ఈ చిన్నదానికి కూడా స్టార్ కు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. ఇటీవల అర్హ సమంత శాకుంతలంలో మెరిసిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాలోని హీరోకు ఉన్న వ్యాధే : ఇక ఆ సంగతి పక్కన పెడితే... బన్నీ భార్యకు ఓ వ్యాధి ఉందట. అది కూడా తెలుగు సినిమాలోని ఓ హీరోకు ఉన్న వ్యాధి అంట. ఏం సినిమా అని ఆలోచిస్తున్నారా.. అదేనండి.. మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం మహానుభావుడు. అయితే ఈ పాటికి మీకు అర్థం అయి ఉంటుంది. ఆ సినిమాలో హీరోకు ఓసీడీ వ్యాధి ఉంటుంది. ఈ వ్యాధి లక్షణం ఏ వస్తువు అయినా.. ప్లేస్ అయినా, మనిషి అయినా పరిశుభ్రంగా ఉండాల్సిందే. అయితే ఇలాంటి వ్యాధితో బన్నీ భార్య బాధపడుతుందట.

బన్నీని దూరం పెట్టిన స్నేహ : స్నేహ రెడ్డికి ఈ ఓసీడీ వ్యాధి ఉందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు క్లీన్ నెస్ అంటే ఇష్టం అంట. ఎంతలా అంటే.. కిటికీపై కూడా చిన్న దుమ్ము ఉండకుండా చూసుకుంటుందట. ఇల్లు మొత్తం నీట్ గా పెట్టుకుంటుందని చెబుతున్నారు. అంతే కాదు.. పుష్ప సినిమా కోసం బన్నీ దుమ్ముధూళితో వస్తే.. రెండు నెలలు దూరంగా పెట్టిందట. కేవలం బన్నీ విషయంలోనే కాదట.. పిల్లల విషయంలోనూ ఇలాగే ట్రీట్ చేస్తుందని సమాచారం.


Click it and Unblock the Notifications











