సైరాకి గోనగన్నారెడ్డి సాయం.. మెగాస్టార్ కోసం రంగంలోకి దిగుతున్న బన్నీ!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తరువాత మరో చిత్రాన్ని ప్రకటించకుండా అభిమానులని నిరీక్షణలోనే ఉంచాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో బన్నీ కొత్త చిత్రం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం గురించి చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డిలో బన్నీ కూడా భాగం కాబోతున్నాడట.

స్వాతంత్ర సమరయోధుడిగా
తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కీర్తి పొందారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహా రెడ్డి చిత్రం తెరక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు సౌత్ లోని ప్రముఖ నటులు భాగమవుతున్నారు. విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

రాంచరణ్ నిర్మాణంలో
మెగా పవర్ స్టార్ రాంచరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్ కూడా చిన్న కామియో రోల్ లో కనిపించబోతున్నట్లు వినికిడి. హాలీవుడ్ ఫైట్స్ మాస్టర్స్ ఆధ్వర్యంలో సైరా యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

క్రేజీ న్యూస్
ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వాయిస్ ఓవర్ తో ప్రారంభించాల్సిన అవసరం ఉందంటూ సురేందర్ రెడ్డి చెబుతన్నారట. వాయిస్ ఓవర్ అందించడానికి ఎవరైతే బావుంటుంది అని చర్చ జరిగితే.. బన్నీ ప్రస్తావన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా బన్నీ అయితే బావుంటుందని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వేసవిలో విడుదల
వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా మెగాస్టార్ నటించడం ఇదే తొలిసారి. ఇప్పటీకే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బన్నీ వాయిస్ ఓవర్ అందించే విషయంపై చిత్ర యూనిzఅధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











