twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ కుమార్, బన్నీ సినిమాకు నిర్మాత అతడే.. బన్నీతో నాలుగోసారి!

    |

    Recommended Video

    Allu Arjun Keeps 3 Star Directors In Queue

    నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ కొత్త చిత్రంపై ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ దిశగా కదలికలు మొదలైనట్లు తెలుస్తోంది. నా పేరు సూర్య చిత్రం ఫాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో నెక్స్ట్ మూవీ తో అభిమానులని సంతృప్తి పరచాలని బన్నీ భావిస్తున్నాడు. ఆలస్యం జరిగినా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనేది బన్నీ ఆలోచన. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించడం దాదాపుగా ఖరారైంది. ఇక ప్రకటన మాత్రమే తరువాయి అని సినీవర్గాలు అంటున్నాయి. ఈ చిత్ర విషయంలో మరో ముందడుగు పడింది.

    చివరకు విక్రమ్ కుమార్ వైపే

    చివరకు విక్రమ్ కుమార్ వైపే

    నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచిన తరువాత పలువురు దర్శకులు వినిపించిన కథలని బన్నీ విన్నాడు. విక్రమ్ కుమార్ తో పాటు, శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, విఐ ఆనంద్ బన్నీకి కథ వినిపించినట్లు తెలుస్తోంది. చివరకు అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ పైనే నమ్మకం ఉంచాడు.

    తుది మెరుగులు

    తుది మెరుగులు

    బన్నీ సూచించిన కొన్ని మార్పులతో విక్రమ్ కుమార్ ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు.

    నిర్మాత అతడే

    నిర్మాత అతడే

    ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఇటీవల వరుసగా బడా చిత్రాలని నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన భరత్ అనే నేను సమ్మర్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. రాంచరణ్, బోయపాటి చిత్రాన్ని , రాజమౌళి మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మిస్తుంది కూడా ఆయనే.

    బన్నీతో నాలుగోసారి

    బన్నీతో నాలుగోసారి

    అల్లు అర్జున్ తో ఇప్పటికే దానయ్య మూడు చిత్రాలు నిర్మించారు. దేశముదురు, జులాయి, వరుడు చిత్రాలు ఆయన నిర్మాణంలో వచ్చినవే. నాలుగోసారి ఈ కాంబినేషన్ సిద్ధం అవుతోంది.

    English summary
    Allu Arjun will soon announce his new film. Vikram Kumar will direct this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X