బన్నీ 'ఇద్దరమ్మాయిలతో' లో స్పెషల్ ఎట్రాక్షన్ గా...
హైదరాబాద్ : అల్లు అర్జున్ తన తాజా చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే రీసెంట్ గా దాదాపు అరవై కాస్ట్యూమ్స్ తో ఫోటో షూట్ చేసారు. అంతేగాక అతను ఈ ఫోటో షూట్ లో భాగంగా గిటార్ తో ఇచ్చిన ఫోజ్ కేక పెట్టించిందని సమాచారం. దాన్ని ఫస్ట్ లుక్ గా విడుదల చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి దాకా అల్లు అర్జున్ తో గిటార్ ఉంటుందని సమాచారం. హింది సినిమాల్లో షారూఖ్ ఖాన్ లాగ ఇందులో అల్లు అర్జున్ తన లవ్ స్టోరీతో,గిటార్ వాయించే పాటలతో అలరిస్తాడని చెప్పుకుంటున్నారు.
ఇక 'జులాయి' సినిమాతో తన జోష్ చూపించారు అల్లు అర్జున్. ఆకతాయి కుర్రాడిగా బన్నీ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు ప్రేమికుడి అవతారం ఎత్తుతున్నారు. ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమలోకి దింపేస్తున్నారు. ఆ సినిమానే 'ఇద్దరమ్మాయిలతో'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లుఅర్జున్‌తో అమలాపాల్, కేథరిన్ ఆడిపాడనున్నారు. బండ్ల గణేష్ నిర్మాత.
ఈనెల 19 నుంచి బ్యాంకాక్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారు. అక్కడ కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కిస్తారు. సింహభాగం విదేశాల్లోనే షూటింగ్ జరగనుంది. చాలాకాలం తరవాత పూరి తెరకెక్కిస్తున్న ప్రేమకథ ఇది. వినోదం, యాక్షన్ సన్నివేశాలకూ చోటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాటను సిద్ధం చేశారు.


Click it and Unblock the Notifications












