‘పుష్ప’ నుంచి లీకైన సెన్సేషనల్ న్యూస్: సినిమాకు హైలైట్ అదే.. ఆ సీన్‌కు గూస్‌బమ్స్ గ్యారెంటీ!

జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న అతడు.. గత ఏడాది 'అల.. వైకుంఠపురములో'తో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రిజల్ట్ వల్ల వచ్చిన ఉత్సాహంతో ఆ వెంటనే సుకుమార్‌తో 'పుష్ప' అనే మూవీని పట్టాలెక్కించేశాడు. పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దీని నుంచి సెన్సేషనల్ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

లెక్కల మాస్టారుతో మూడోసారి జోడీ

లెక్కల మాస్టారుతో మూడోసారి జోడీ

'ఆర్య', 'ఆర్య2' వంటి చిత్రాలను తెరకెక్కించిన సుకుమార్‌తో అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పుష్ప రాజ్‌గా మారేందుకు సరికొత్తగా

పుష్ప రాజ్‌గా మారేందుకు సరికొత్తగా

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఇందులో గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటించనున్న అతడు.. లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే, చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. డీ గ్లామర్‌గా ఉండే ఈ రోల్ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు కూడా.

‘పుష్ప' రాజ్ ఒక్కడు కాదు... ఇద్దరు

‘పుష్ప' రాజ్ ఒక్కడు కాదు... ఇద్దరు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, అదే సినిమాలో మెయిన్ ట్విస్ట్ అని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం గతంలో విడుదల చేసిన పోస్టర్‌లో బన్నీ కాలికి ఆరు వేళ్లు కనిపించాయి. అయితే, ఇటీవల వచ్చిన రిలీజ్ పోస్టర్‌లో మాత్రం ఐదు వేళ్లే ఉన్నాయి. దీంతో ఇందులో ఇద్దరు హీరోలు ఉన్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ కోసం భారీగా ఖర్చు

బాలీవుడ్ బ్యూటీ కోసం భారీగా ఖర్చు

ఈ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ షూటింగ్ త్వరలోనే జరగనుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో మిస్ ఇండియా ఊర్వశీ రౌటేలా నటిస్తుందని అంటున్నారు. ఈ పాట కోసం ఆమెకు సుమారు రూ. 80 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

‘పుష్ప' నుంచి సెన్సేషనల్ న్యూస్ లీక్

‘పుష్ప' నుంచి సెన్సేషనల్ న్యూస్ లీక్

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరం అటవీ ప్రాంతంలో 'పుష్ప' షూటింగ్ జరుపుకుంది. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు బన్నీపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత అక్కడ ప్లాన్ చేసిన పార్ట్ మొత్తం పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది.

హైలైట్ అదే... గూస్‌బమ్స్ గ్యారెంటీ!

హైలైట్ అదే... గూస్‌బమ్స్ గ్యారెంటీ!

'పుష్ప'లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ హైలైట్‌గా నిలుస్తుందట. దీనికి కారణం ఆ సీన్‌లో అతడు తోడేళ్లతో ఫైట్ చేయడమేనని ఓ న్యూస్ లీకైంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఉండే ఈ సీక్వెన్స్ హాలీవుడ్ చిత్రాల మాదిరిగా డిజైన్ చేశారని అంటున్నారు. ఇందులో బన్నీ సిక్స్ ప్యాక్‌తో దర్శనమివ్వనున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ సీన్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X