Allu Arjun- Jr NTR: అల్లు అర్జున్ దూకుడు.. ఎన్టీఆర్‌కు రూట్ క్లియర్ అయినట్టేనా?
టాలీవుడ్‌లో గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్‌గా మారిన అంశం.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కించబోయే భారీ మైథలాజికల్ సినిమాకు హీరో ఎవరు అన్న ప్రశ్న. మొదట ఈ ప్రాజెక్ట్‌ను జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్నారు. కానీ ఆ తర్వాత మధ్యలో అల్లు అర్జున్ (Allu Arjun)పేరు వినిపించడంతో అభిమానుల మధ్య గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో చర్చలు, వాదనలు ఓ రేంజ్‌లో సాగాయి. సంక్రాంతి 2026 నాటికి క్లారిటీ వస్తుందని భావించినా.. అప్పటివరకు కూడా మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.
ఈ గందరగోళానికి తాజాగా జరుగుతున్న పరిణామాలు ఓ క్లూ ఇస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్ట్‌లకు కమిట్ అయ్యాడు. ఇటీవలే బన్నీ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాను #AA23గా తెరకెక్కించనుండగా, సంగీతం అనిరుద్ రవిచందర్ అందించనున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో కూడా విడుదలై, అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది.

దీనితో పాటు అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ (Atlee)తో మరో భారీ ప్రాజెక్ట్ (#AA22xA6)లో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపిక పడుకొణే , జాన్వీ కప్పూ కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు సినిమాలే బన్నీకి పెద్ద కమిట్‌మెంట్స్‌గా ఉండటంతో, మరో భారీ ప్రాజెక్ట్‌కు డేట్లు కేటాయించడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మరోవైపు త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ కథపై చాలా కాలంగా పని చేస్తున్నట్టు సమాచారం. స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిందని, 2026లోనే షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్‌లో ఉన్నాడని టాక్. ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా, టాలీవుడ్‌లో ఇప్పటివరకు చూడని స్థాయిలో రూపొందనుందని అంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుందని సమాచారం.
ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా మారడం వల్ల, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్‌నే ఫైనల్ హీరోగా ఖరారైనట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఇప్పటికే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డేట్లు కేటాయించగలడని భావిస్తున్నారట. అందుకే మొదట ప్రకటించినట్లే ఈ సినిమాకు ఎన్టీఆర్‌నే కొనసాగించాలని మేకర్స్ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. "సరైన సమయం వచ్చినప్పుడు హీరోపై క్లారిటీ ఇస్తాం" అని మేకర్స్ చెబుతున్నట్టు సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్ ఇతర భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల, త్రివిక్రమ్ మైథలాజికల్ సినిమాలో ఎన్టీఆర్‌కి రూట్ క్లియర్ అయినట్టేనా అన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు నిజం ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











