‘పుష్ప’ ఆ సినిమాకు కాపీనా: అల్లు అర్జున్ మూవీపై ఊహించని న్యూస్.. అవన్నీ సెట్ అవడం వల్లే ఇలా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా చిత్రాల హవా కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలంతా మిగిలిన పరిశ్రమల్లోనూ హవాను చూపించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే బహు భాషా చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. దీంతో వరుసగా ఇండియా రేంజ్ చిత్రాలు రూపొందుతోన్నాయి. అందులో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప' ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఇది ఓ సినిమాకు కాపీ అంటున్నారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

‘పుష్ప' అంటూ రాబోతున్న అల్లు అర్జున్
'ఆర్య', 'ఆర్య2' వంటి చిత్రాల తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందుతోంది. ఇందులో కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఐకాన్ స్టార్... సినిమా కోసం సాహసాలు
'పుష్ప' మూవీ గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఇందులో గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటించనున్న అతడు.. లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే, చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. డీ గ్లామర్‌గా ఉండే ఈ రోల్ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు కూడా.

పుట్టినరోజు కానుక.. టాలీవుడ్‌లో టాప్‌లో
ఆ మధ్య అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ ఇటీవలే యాభై మిలియన్ మార్కును చేరుకుంది. ఇప్పుడు 55 మిలియన్ వ్యూస్‌తో టాలీవుడ్‌లోనే టాప్ టీజర్‌గా నిలిచింది.

కరోనా సమయంలోనూ షూటింగ్ షురూ
కరోనా ప్రభావంతో సినిమా షూటింగులు నిలిచిపోతున్నాయి. అయినప్పటికీ 'పుష్ప' చిత్రీకరణ మాత్రం నిరంతరంగా జరిగింది. హైదరాబాద్‌లో నిన్న మొన్నటి వరకూ కొనసాగిన షెడ్యూల్‌లో విలన్‌గా చేస్తున్న మరో హీరో ఫహద్ ఫాసిల్‌పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాడు. అలాగే, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఈ చిత్రీకరణలో భాగమైంది.

అల్లు అర్జున్ మూవీపై ఊహించని న్యూస్
అల్లు అర్జున్ కెరీర్‌లోనే 'పుష్ప' మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీతనంతో తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా.. గతంలో మణిరత్నం - విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'రావణ్' (తెలుగులో విలన్)కు కాపీ అని తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Recommended Video

అవన్నీ కలిశాయి.. కాపీ అంటున్నారుగా
విక్రమ్ నటించిన 'రావణ్'లో హీరోను విలన్‌గా.. విలన్‌ను హీరోగా చూపించాడు. అలాగే, సోదరి సెంటిమెంట్‌తో తెరకెక్కింది. దీనితో పాటు అటవీ నేపథ్యంతో వచ్చింది. ఇప్పుడు బన్నీ నటిస్తోన్న 'పుష్ప'లో సైతం అలాంటి ఛాయలే కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా దానికి కాపీ అంటున్నారు. వాస్తవానికి దీనికి దానికి అస్సలు ఏమాత్రం సంబంధం ఉండదని చిత్ర యూనిట్ అంటోంది.


Click it and Unblock the Notifications











