ముందే లీకైన ‘పుష్ప’ టీజర్ హైలైట్స్: అల్లు అర్జున్ బర్త్‌డే గిఫ్ట్ అదే.. అందులో అదిరిపోయే సర్‌ప్రైజ్

బడా నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. గత ఏడాది మాటల మాంత్రికుడు తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత 'పుష్ప'తో పాన్ ఇండియా బాట పట్టాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం టీజర్ రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వీడియోలోని హైలైట్లు లీకయ్యాయి. ఆ వివరాలు మీకోసం!

ఆయనతో మూడో సారి జతకట్టిన బన్నీ

ఆయనతో మూడో సారి జతకట్టిన బన్నీ

'ఆర్య', 'ఆర్య2' తదర్వా సుకుమార్‌తో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రమే 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది.

డీ గ్లామర్ పాత్రతో మాయ చేసేందుకిలా

డీ గ్లామర్ పాత్రతో మాయ చేసేందుకిలా

గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఎన్నో సాహసాలు చేస్తున్నాడు. ఇందులో గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటించనున్న అతడు.. లారీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలాగే, చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. డీ గ్లామర్‌గా ఉండే ఈ రోల్ కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడు కూడా.

రెండు పోస్టర్లు... ఇద్దరన్న అనుమానం

రెండు పోస్టర్లు... ఇద్దరన్న అనుమానం

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప'లో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, అదే సినిమాలో మెయిన్ ట్విస్ట్ అని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం గతంలో విడుదల చేసిన పోస్టర్‌లో బన్నీ కాలికి ఆరు వేళ్లు కనిపించాయి. అయితే, ఇటీవల వచ్చిన రిలీజ్ పోస్టర్‌లో మాత్రం ఐదు వేళ్లే ఉన్నాయి. దీంతో ఇందులో ఇద్దరు హీరోలు ఉన్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.

అల్లు అర్జున్ పుట్టినరోజు కానుక సిద్ధం

అల్లు అర్జున్ పుట్టినరోజు కానుక సిద్ధం

'పుష్ప' మూవీ టీజర్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే అంటే ఏప్రిల్ 7న విడుదల కాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల మరో న్యూస్ బయటకు వచ్చింది. అయితే, ఇది టీజరా? గ్లింమ్స్ వీడియోనా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారిందనే చెప్పాలి.

ముందే లీకైన ‘పుష్ప' మూవీ సర్‌ప్రైజ్

ముందే లీకైన ‘పుష్ప' మూవీ సర్‌ప్రైజ్

'పుష్ప' సర్‌ప్రైజ్ గురించి సోషల్ మీడియాలోఈ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో ఈ మూవీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి వీడియో విడుదల చేస్తున్నారు? అందులో ఏఏ అంశాలను చూపించబోతున్నారు? అన్న దానిపై ఓ న్యూస్ లీకైంది. దీంతో అది ఎలా రూపొందింది అన్న విషయంపై క్లారిటీ వచ్చేసినట్లైంది.

అల్లు అర్జున్ బర్త్‌డే గిఫ్ట్ అదే.. సర్‌ప్రైజ్

అల్లు అర్జున్ బర్త్‌డే గిఫ్ట్ అదే.. సర్‌ప్రైజ్

'పుష్ప' నుంచి వచ్చే వీడియోను అన్ని భాషల్లో కాకుండా KGF2 మాదిరిగా ఒకటేలా రూపొందించారట. ఇందులో నటీనటుల డైలాగులు ఉండవని తెలుస్తోంది. అయితే, ఈ వీడియోలో హీరో ఎలివేషన్ సీన్ మాత్రం హైలైట్‌గా ఉంటుందట. అలాగే, దేవీ శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందని తెలుస్తోంది. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మంచి మాస్ బిర్యానీ రెడీ అవుతుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X