Just In
- 4 hrs ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
- 5 hrs ago
తెలుగులో భారీగా ఆఫర్లు అందుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. అఖిల్, బన్నీతో కూడా..
- 5 hrs ago
నగ్నంగా సీనియర్ నటి ఫోటోషూట్.. సంచలనం రేపుతున్న కిమ్
- 6 hrs ago
మహానటి దర్శకుడి కోసం మరో కొత్త ప్లాన్ రెడీ చేసుకున్న ప్రభాస్!
Don't Miss!
- News
బుద్ధి చూపిన చైనా: వాస్తవాధీన రేఖ వెంబడి దేప్సంగ్ ప్రాంతంలో భారీ నిర్మాణాలు
- Finance
ఆ ధరతో రూ.10,500 తక్కువ, రూ.46,000 దిగువకు పడిపోయిన బంగారం
- Sports
హార్దిక్ పాండ్యాతో పోటీకి శార్దూల్ ఠాకూర్ సై.. 6 సిక్స్‌లతో వీరవిహారం.. సెంచరీ జస్ట్ మిస్!
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Lifestyle
బియ్యం పిండిని ఇలా ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతాల గురించి మీకు తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
మెగా కాంపౌండ్ నుంచి సినిమాల్లోకి ప్రవేశించినా.. ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అలాగే, ప్రతి ప్రాజెక్టుకూ వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'పుష్ప' అనే సినిమాను చేస్తున్నాడు. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ విషయంలో బన్నీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. వివరాల్లోకి వెళ్తే..

ఇన్నేళ్లకు ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్
గత ఏడాది సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా చాలా కాలం తర్వాత బన్నీకి మొదటి ఇండస్ట్రీ హిట్ సొంతం అయింది.

మూడోసారి ఆ దర్శకుడితో స్టైలిష్ స్టార్ జోడీ
‘అల' విజయం ఇచ్చిన ఉత్సాహంతో వెంటనే లెక్కల మాస్టారు సుకుమార్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు అల్లు అర్జున్. ‘ఆర్య', ‘ఆర్య2' తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమే ‘పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది.

సరికొత్త లుక్.. బాడీ లాంగ్వేజ్.. స్లాంగ్‌తో రెడీ
‘పుష్ప' పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోండడంతో అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే డీ గ్లామర్ లుక్‌కు రెడీ అయ్యాడు. అంతేకాదు, ఇందులో చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు. వీటన్నింటికీ మించి ఈ సినిమా గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటించనున్న అతడు.. సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నాడట.

షాకిచ్చిన స్టార్ హీరో.... అన్వేషణ ఆగలేదు
ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రకు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అయితే, ఆయన అనూహ్యంగా ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఆయనతో పలుమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. దీంతో మరో స్టార్ కోసం అన్వేషిస్తూనే ఉన్నారు.

బాలీవుడ్ బ్యూటీతో చిందేసేందుకు ఆరాటం
ఇక, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించింది. అందుకోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకుంటామని కూడా వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ పాట కోసం మాజీ మిస్ ఇండియా ఊర్వశీ రౌటేలాను తీసుకుంటున్నారని అన్నారు. అయితే, ఈ మధ్య దిశా పటానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో ఎవరుంటారన్నది సస్పెన్స్‌గా మారింది.

‘పుష్ప' విషయంలో అల్లు అర్జున్ యూటర్న్
‘పుష్ప'ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని మొత్తం పది భాషల్లో రిలీజ్ చేయాలని అల్లు అర్జున్ అండ్ టీమ్ భావిస్తున్నాడట. యూనివర్శల్ కంటెంట్ కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, మిగిలిన ఐదు భాషలు ఏవై ఉంటాయన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.