అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలిని మించేలా అట్లీ ప్లాన్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఏకంగా పుష్ప సినిమాలతో వెయ్యి కోట్ల మార్క్ దాటేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun), తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పేరు ఖరారైన సంగతి తెలిసిందే. బన్నీ పుట్టినరోజు సందర్భంగా 'రాకా' అనే టైటిల్‌ని ప్రకటిస్తూ మూవీ మేకర్స్ బుధవారం ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఈ పోస్టర్‌ పెంచేసింది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పార్ట్ కాబోతుందా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అట్లీ ప్లాన్ ఏంటీ?

Also Read
అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్.. 'మహావతార్' స్పూర్తితో భారీ ప్లాన్!
అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్.. 'మహావతార్' స్పూర్తితో భారీ ప్లాన్!

పాన్ ఇండియా లెవల్‌లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న 'రాకా' సినిమా టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ ప్రతి అప్‌డేట్‌తో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్‌తో ఈ సినిమా హైప్ మరో స్థాయికి చేరుకుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లు అర్జున్ పూర్తిగా గుండు లుక్‌లో, సగం మనిషి, సగం మృగం లాగా ఫియర్స్ అవతార్‌లో కనిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

Allu Arjun s Raaka Ramya Krishnan Joins Atlee Plans Bigger Than Baahubali
Recommended For You
ఏడేళ్ల ప్రేమ.. ఏడాదే కాపురం.. ప్రతి రాత్రి నరకం చూశా
ఏడేళ్ల ప్రేమ.. ఏడాదే కాపురం.. ప్రతి రాత్రి నరకం చూశా

ఈ లుక్ ద్వారా సినిమా కథ చాలా ఇన్‌టెన్స్‌గా, డార్క్ షేడ్స్‌తో ఉండబోతుందని క్లియర్‌గా తెలుస్తోంది. 'రాకా' అనే టైటిల్ కూడా రాక్షసుడు లేదా శక్తివంతమైన వ్యక్తిని సూచించేలా ఉండటంతో, కథలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కీలకమని అర్థమవుతోంది. అంతేకాదు, అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తారని, అందులో ఒక పాత్ర నెగెటివ్ టచ్‌తో ఉంటుందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.

You May Also Like
ఒక్క రాత్రికి నా రేటు అంత ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన..
ఒక్క రాత్రికి నా రేటు అంత ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన..

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures)అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో, లాస్ ఏంజెల్స్‌కు చెందిన టాప్ VFX టీమ్స్ ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాయి. దీంతో 'రాకా' విజువల్‌గా భారతీయ సినిమాల్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కథ విషయానికి వస్తే, ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉండబోతుందని టాక్. భారతీయ పురాణాల టచ్‌తో పాటు, మోడ్రన్ టెక్నాలజీ మిళితం చేసి అట్లీ ఈ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం.

నల్లగా పుట్టడం నా తప్పా ? బాడీ షేమింగ్ కామెంట్స్ పై బజర్థస్త్ నటి ఆవేదన
నల్లగా పుట్టడం నా తప్పా ? బాడీ షేమింగ్ కామెంట్స్ పై బజర్థస్త్ నటి ఆవేదన

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే నటించడం ఇప్పటికే కన్ఫర్మ్ కాగా, మరో సర్‌ప్రైజ్‌గా సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 'బాహుబలి'లో శివగామిగా ఆమె చూపించిన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ తరువాత ఆమెకు వచ్చిన ఇమేజ్ దృష్ట్యా, 'రాకా'లో కూడా కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆమె స్వయంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేయడం ద్వారా ఈ వార్తలకు బలం చేకూరింది

Sudigali Sudheer: ఆమెతో 14 ఏళ్ల రిలేషన్.. ఆ విషయం తట్టుకోలేక నడిరోడ్డుపై అలా..
Sudigali Sudheer: ఆమెతో 14 ఏళ్ల రిలేషన్.. ఆ విషయం తట్టుకోలేక నడిరోడ్డుపై అలా..

రమ్యకృష్ణ తన అద్భుతమైన నటనతో, హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసే పవర్ ఫుల్ పాత్రలకు పెట్టింది పేరు. ముఖ్యంగా 'బాహుబలి'లోని శివగామిగా రాచరికపు అధికారానికి, 'నరసింహ'లోని నీలాంబరిగా నెగెటివ్ ఛాయలున్న ధీరత్వానికి, అలాగే 'అమ్మోరు'లో దైవత్వం ఉట్టిపడే పాత్రలకు ఆమె ప్రాణం పోశారు. అలా స్టార్ హీరోయిన్ ను ఈ సినిమాలో నటిస్తున్నారంటే.. అట్లీ బాహుబలిని మించిన ప్లానే వేసినట్టు ఉన్నారని సిని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా.. రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో వేచిచూడాలి.

More from Filmibeat

Read more about: allu arjun atlee ramya krishnan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X