Allu Ayaan అల్లు వారసుడు దిగుతున్నాడు.. ఆ సూపర్ హిట్ సీక్వెల్ సినిమాతోనే ఎంట్రీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ ఒక్క సినిమాతో బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగులో బిజీగా ఉన్న ఈ హీరో ఫ్యామిలీతోనూ ఎక్కువగానే టైం స్పెండ్ చేస్తుంటాడు. అయితే అల్లు వారసుడు అల్లు అయాన్ కూడా సినిమాల్లోకి రానున్నారని సమాచారం. దానికోసం తండ్రి ఓ సూపర్ ప్లాన్ వేశారట. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అసలు అల్లు అయాన్ ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు.. ఏంటి అనేది ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
వరల్డ్ వైడ్ ఫేమస్ : మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ హీరోగా వచ్చినప్పటికీ.. ఇప్పుడు తనకంటూ ఓ బ్యాక్ గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నారు. ఐకానిక్ గుర్తింపు తెచ్చుకుని అల్లు బ్రాండ్ సృష్టించేశాడు. గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ ఒక్క సినిమాతో బన్నీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. గల్లీ నుంచి పొలిటికల్, క్రికెటర్స్, నేషనల్ లీడర్స్ అంతా పుష్ప స్వాగ్ యూజ్ చేసిన వారే. తగ్గేదేలే అనే డైలాగ్ అయితే వరల్డ్ వైడ్ ఫేమస్.

ఇప్పటికే అల్లు అర్హ ఎంట్రీ : అయితే బన్నీ తను ప్రేమించిన స్నేహరెడ్డిని పెళ్లాడిన విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. అల్లు అర్హ, అల్లు అయాన్. వీరు ఇద్దరు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అల్లు అర్హకు అయితే ప్రత్యేక ఫ్యాన్ బే్స ఉంది. సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ సెట్టర్. ఇప్పటికే అల్లు అర్హతో బన్నీ ముద్దు ముద్దు మాటలు పలికిస్తూ.. స్టార్ ను చేసేశాడు. ఇక ఆ మధ్య సమంత నటించిన శాకుంతలం సినిమాతో అల్లు అర్హ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయాన్ వెరైటీ : కేవలం 10 నిమిషాల సీన్ కోసం అల్లు అర్హ 20లక్షల రెమ్యునరేషన్ తీసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక అల్లు అర్హతో పోలిస్తే.. అల్లు అయాన్ కాస్త వెనకబడ్డడానే చెప్పాలి. అయితే అల్లు అయాన్ మాత్రం.. ఈ మధ్య మస్తు ట్రెండ్ అవుతున్నాడు. అల్లు ఫ్యామిలీలో అందరూ ఒకెత్తు అయితే.. అల్లు అయాన్ వెరైటీ. కరోనా టైంలోనే అందరూ చప్పట్లు కొడుతుంటే.. అయాన్ మాత్రం వెరైటీగా డ్యాన్స్ చేస్తూ వైరల్ అయ్యాడు.

అల్లు మోడల్ : ఇక ఆ మధ్య కుర్తి మెడలో వేసుకుని అల్లు మోడల్ అయిపోయాడు. పుష్ప 2 షూటింగులో బిజీగా ఉన్న అల్లు అర్జున్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెరిసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి వారు అల్లు అయాన్ గురించి అడిగితే మోడల్ బోల్తే అంటూ బన్నీ చెప్పుకువచ్చాడు. ఇక నిన్నటికి నిన్న షారుఖ్ పాట పాడి మరింత ఫేమస్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అయన్ కు వస్తున్న క్రేజ్ తోనే ఇప్పుడు సినిమా ఎంట్రీ ఇచ్చేస్తే అని ఆలోచిస్తున్నారట.
ఆ సినిమాతో ఎంట్రీ : అల్లు అయాన్ కోసం పుష్ప 2లో ఓ కీలక పాత్రను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అల్లు అయాన్ కెమియో పుష్ప 2లో ఉంటుందని సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇదే నిజమైతే బాగుండని అల్లు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అల్లుఅయాన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ అయిపోవాలనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











