For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అయాన్ త్వరలో వెండి తెరపైకి ఎంట్రీ ?

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్ ముద్దుల కుమారుడు అల్లు అయాన్ వెండితెరపై పలకరించనున్నారా..అవుననే వినపడుతోంది. ఈ మేరకు అల్లు అర్జున్ ని అడిగినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆ సర్ఫైజ్ ఎంట్రీ బోయపాటి శ్రీను తో చేస్తున్న చిత్రంతో జరిగే అవకాసం ఉందని అంటున్నారు.
  గతంలో ఇదే వయస్సులో నాగార్జున కుమారుడు అఖిల్ ...సిసింద్రీగా కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గా సుధీర్ బాబు కుమారుడు ..నాని తాజా చిత్రం భలే భలే మొగాడివోయ్ చిత్రంలో కనిపించారు. మొన్నా మధ్య మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సైతం వెండితెరపై కనిపించి అలరించారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  అల్లు అర్జున్,బోయపాటి చిత్రం లేటెస్ట్ ఇన్ఫో...

  అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం ఈ ఫైట్‌ చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నార్త్‌ సిటీలో రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్.

  ఆటకైనా, పాటకైనా, ఫైటుకైనా.. 'సరైనోడు' ఆ యువకుడు. ఏదో పని మీద పాతబస్తీకొచ్చాడు. హీరో ఎప్పుడు దొరకుతాడా అని వేచిచూస్తున్న విలన్‌ మాటేసి దెబ్బేయాలనుకున్నాడు. కానీ హీరో దాన్ని తిప్పి కొట్టాడు. తనను ఉతకడానికి వచ్చిన రౌడీలను గింగిరాలు తిప్పించాడు.

   Allu Ayaan to Debut in Tollywood?

  ఈ చిత్రం కోసం 'సరైనోడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

  అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘అల్లు అర్జున్‌, బోయపాటి శీను కాంబినేషన్‌లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. బోయపాటి శ్రీను చెప్పిన కథ నాకు, బన్నికి బాగా నచ్చి మా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తున్నాం. పూర్తిస్థాయి హీరోయిజం ఉంటూ ప్యూర్‌ లవ్‌ స్టోరీ మిక్స్‌ అయిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తాం. బన్నిని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో పక్కాగా అలాంటి పాత్రతో బోయపాటి శీను కథ చెప్పారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. బన్ని కాంబినేషన్‌లో థమన్‌ చేస్తున్న రెండో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది'' అని తెలిపారు.

  బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను'' అని తెలిపారు.

  ఇక మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను కావటంతో వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

  English summary
  we get to see Allu Arjun’s little son Allu Ayaan on silver screen in Bunny’s next with Boyapati Sreenu?
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X