మరో రీమేక్‌తో అల్లు శిరీష్.. డైరెక్టర్ ఎవరంటే..?
మెగా హీరోల్లో ఖాళీగా ఉన్నది ఒక్క అల్లు శిరీష్ మాత్రమే. చేసిన ఏ చిత్రమూ వర్కౌట్ కాకపోవడంతో ఇంతవరకు సరైన హిట్ చిత్రం పడలేదు. ఎన్ని రకాలు ప్రయత్నించినా, ప్రయోగాలు చేసిన విజయమన్నది అందని ద్రాక్షలానే మారుతోంది. ఎంతో అంచనాలతో వచ్చిన ఏబీసీడీ కూడా బోల్తా కొట్టింది.
మలయాళి రీమేక్‌గా తెరకెక్కించిన ఏబీసీడీ చిత్రం హిట్ కొడుతుందని అంతా భావించినా అది కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఆచితూచి తదుపరి ప్రాజెక్ట్‌ను ఎంచుకుంటున్న అల్లు శిరీష్ అందుకోసం భారీగానే సమయాన్ని వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. నెక్ట్స్ మూవీ గురించి నెటిజన్స్ అడిగిన ప్రతీసారి.. త్వరలోనే చెబుతానంటూ దాటవేస్తూ వస్తున్నాడు.

అల్లు శిరీష్ తదుపరి చిత్రం గురించి ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఓ తమిళ హిట్ మూవీని విజేత ఫేమ్ డైరెక్టర్ రాకేష్ శశి చేతిలో పెట్టాడని తెలుస్తోంది. నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయాలని అల్లు అరవింద్ సూచించాడట. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.


Click it and Unblock the Notifications











