అల్లు శిరీష్ ను చూస్తుంటే ఇక ఆగేట్టులేడు...!
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడా? ఇప్పటికే క్రౌడ్ ఎక్కువయిన మెగా స్టార్స్ లో ఇంకో హీరోకి చోటుందా? చోటుందో లేదో తెలియదు కానీ ఒకసారి ట్రై చేసి చూద్దాం అని అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ ఫిక్సయ్యాడు. శిరీష్ హీరోగా త్వరలో ఓ చిత్ర రూపొందనుందని వార్తలొస్తున్నాయి. ఇటీవలే నటనలో శిక్షణ తీసుకుని వచ్చాడని, అతి త్వరలో తొలి చిత్రం మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని శిరీష్ గురించి సన్నిహితుల నుండి అందిన సమాచారం. శిరీష్ కూడా ఇది నిజమేనన్న సంకేతాలు అందించాడు.
హీరో అవుతున్నావట కదా అని ఎవరైనా అడిగితే ఒక వెరైటీ ప్రయత్నం చేయాలని ఉందని, ఏదైనా ఆసక్తికరమైన సినిమా వస్తే 'ఫన్" కోసం చేస్తానని శిరీష్ చెప్తున్నాడట. ఈ మాటా అంటూనే ఇంకా దీని గురించి సీరియస్ గా ఆలోచించలేదని కవర్ చేసుకున్నాడు. అయితే నటించాలనే కోరిక మాత్రం చాలా గట్టిగా ఉందంటున్నారు.
అతను హీరో అయితే కనుక మిగతావారి మాటెలా ఉన్నా మెగా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటికే చిరంజీవి మేనల్లుడు ధర్మతేజ హీరోగా రేయ్ చిత్రం ద్వారా తెరమీదకు రానున్నాడు. అలాగే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. చూస్తుంటే మెగా ఫ్యామిలీనే రాజ్యమేలేవిధంగా కనిపిస్తోంది..కదూ..!


Click it and Unblock the Notifications











