అల్లు శిరీష్-మారుతి చిత్రం టైటిల్
హైదరాబాద్ : గౌరవం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన మరో మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్. అతను తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 'కొత్త జంట' టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ రోజుల్లో, బస్ స్టాఫ్ చిత్రాలతో హిట్ లను అందించిన మారుతి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. బన్నీ వాసు నిర్మాతగా నిర్మించనున్నాడు.
గీతాఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మించనున్నారు. యూత్ కామెడీ రెడీ చేసిన స్క్ర్రిప్ట్ ని మారుతి వినిపిస్తే వెంటనే అల్లు అరవింద్ ఓకే చేసినట్లు వినపడుతోంది. అయితే మారుతి..గత చిత్రాలలో బూతు బాగా దిట్టించి వదలటం వల్లనే హిట్ సాధించారనే విమర్శ ఉంది. ఈ చిత్రంతో అయినా రెగ్యులర్ రూట్ లోకి వచ్చి క్లీన్ చిత్రాన్ని అందిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన రెజీనా హీరోయిన్ గా చేస్తోంది.
'గౌరవం' విషయానికి వస్తే...ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ నిర్మాతగా రాధామోహన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'గౌరవం'. ఈ చిత్రం శ్రీ రామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన విధంగా విజయం సాధించలేదు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లోనూ వర్కవుట్ కాలేదు.


Click it and Unblock the Notifications











