అల్లు శిరీష్ హీరోగా ఆ రీమేక్ ఖరారు!?

By Srikanya

అల్లు శిరీష్ ని హీరో చెయ్యాలని తండ్రి అల్లు అరవింద్ ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. అందునిమిత్తం మిస్టర్ ఫెరఫెక్ట్ రీమేక్ రైట్స్ ని తీసుకున్నట్లు సమాచారం. తమిళంలో అల్లు శిరీష్ ని గ్రాండ్ గా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రభాస్ హీరోగా చేసిన ఈ చిత్రం తో లాంచ్ అయితే ఫ్యామిలీస్ ను కూడా ఎట్రాక్ట్ చేయవచ్చని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. అయితే డైరక్టర్ గా ఎవరని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. దశరధ్ మరో ప్రాజెక్టులో బిజిగా ఉండటంతో అతన్ని డైరక్టర్ గా కాదనుకున్నారు.

కానీ అల్లు శిరీష్ సోదరుడు అల్లు అర్జున్ మాత్రం.. మిస్టర్ ఫెరఫెక్ట్ కన్నా 100% లవ్ తో ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఇక మిస్టర్ ఫర్‌ఫెక్ట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తారు. అయితే తమిళంలో మరో పెద్ద బ్యానర్ తో కూడా టై అప్ అయ్యే అవకాశముందని అంటున్నారు. ఇక ప్రస్తుతం అల్లు శిరీష్ తన నటన జీవితం మొదలు పెట్టేందుకు డైన్స్, ఫైట్స్, డైలాగ్ మాడ్యులేషన్ వంటి వాటిల్లో శిక్షణ పొందుతున్నాడని వినికిడి. ఆల్ ది బెస్ట్ అల్లు శిరీష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X