మురుగదాస్ దర్శకత్వంలో అల్లు శిరీష్
అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' రీమేక్ ద్వారా తమిళంలో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. 15 సినిమాలు తమిళంలో చేసిన తర్వాత గానీ తెలుగులో నటించనని అల్లు శిరీష్ శపథం పూనాడు కూడా. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు.
తాజాగా చెన్నయ్ నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు, గజనీ ఫేం మురుగదాస్ దర్శకత్వంలో శిరీష్ నటించనున్నాడని తెలుస్తోంది. 'తొట్టాల్ పూ మాలరుమ్' అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. తొట్టాల్ పూ మాలరుమ్ అంటే ముట్టుకుంటే పువ్వు విచ్చుకుంటుందని అర్థం. తమిళ సీనియర్ నటుడు ఎంజీఆర్ కు సంబంధించి పాపులర్ పాటలోని లిరిక్ ఆధారంగా ఈ టైటిల్ ను పెట్టారట.
తమిళంలో హీరోగా తనను తాను నిరూపించుకునేందుకు అల్లు శిరీష్ ఇప్పటికే చాలా కష్ట పడుతున్నాడు. బాగా ఒళ్లు తగ్గించుకుని స్లిమ్ గా, స్టయిలిష్ గా తయారవ్వడమే కాకుండా, నటన, ఫైట్స్, డాన్స్ విషయంలో ముంబై వెళ్లి నిపుణుల సమక్షంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











