Allu Sirish Wedding: అల్లు శిరీష్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్... అల్లు అర్జున్ ప్రైవేట్ పార్టీ, వాళ్లకు నో ఎంట్రీ?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు నయనిక రెడ్డి మెడలో ఆయన మూడు ముళ్లు వేయనున్నారు. మార్చి 6వ తేదీన హైదరాబాద్‌లో అల్లు అర్జున్ - నయనిక రెడ్డిల వివాహం జరగనుంది. సినీ, రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లికి తరలిరానున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలైపోయాయి. తాజాగా వీరి పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
మార్చి 6న శిరీష్- నయనికల పెళ్లి
అల్లు శిరీష్ - నయనికలు ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కుతున్నారు. గతేడాది అక్టోబర్ 31న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ఆ తర్వాత మార్చి 6వ తేదీన పెళ్లిని నిశ్చయించినట్లు ఇరు కుటుంబాలు తెలిపాయి. ఆ రోజున అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతుల పెళ్లి రోజు కావడంతో మార్చి 6 అల్లు కుటుంబానికి మరింత ప్రత్యేకం కానుంది. పెళ్లికి సమయం దగ్గర పడుతుండటంతో అల్లు ఫ్యామిలీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి.

దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
కొద్దిరోజుల క్రితం దుబాయ్ బీచ్‌లోని ఓ లగ్జరీ యాట్‌లో అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి శిరీష్ - నయనికల సన్నిహితులు, ఫ్రెండ్స్‌తో పాటు అల్లు అర్జున్ - స్నేహారెడ్డి, అల్లు బాబీ తదితరులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక గతవారం అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమంతో అధికారికంగా అల్లు శిరీష్- నయనిక రెడ్డిల పెళ్లిపనులు ప్రారంభించారు. అల్లు - కొణిదెల కుటుంబ సభ్యులు, ఇతర బంధుమిత్రులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.
చిరంజీవికి మొదటి పెళ్లిపత్రిక
ఆ తర్వాత పెళ్లి పత్రికలు పంచే కార్యక్రమాన్ని కూడా అల్లు అరవింద్ ఫ్యామిలీ ప్రారంభించింది. తొలి పెళ్లి పత్రికను చిరంజీవి కుటుంబానికే అందజేసి ఆయనపై అభిమానాన్ని చాటుకుంది అల్లు ఫ్యామిలీ. ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి వెళ్లిన అల్లు శిరీష్.. తొలి ఆహ్వాన పత్రికను చిరంజీవి - సురేఖ దంపతులకు అందజేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
అల్లు అర్జున్ ప్రైవేట్ పార్టీ?
మరోవైపు.. తమ్ముడి పెళ్లితో అల్లు అర్జున్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అన్ని పనులను పర్యవేక్షిస్తున్న ఆయన.. తాజాగా అల్లు శిరీష్- నయనిక రెడ్డిల పెళ్లి సందర్భంగా ఓ ప్రైవేట్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ పార్టీని అల్లు శిరీష్ నిర్వహించగా.. అల్లు అర్జున్ కూడా తమ్ముడి కోసం స్పెషల్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నాడట. అయితే దీనికి అందరికీ ఎంట్రీ లేదట. అల్లు కుటుంబంతో పాటు అత్యంత సన్నిహితులే ఈ ప్రైవేట్ పార్టీలో పాల్గొంటారట. అలాగే ఈ పార్టీకి ప్రత్యేక ఆకర్షణగా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్లను మాత్రమే ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే ఈ పార్టీ స్పెషల్ అని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ఇవ్వబోతున్న పార్టీ.. ఎప్పుడు? ఎక్కడ? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











