ఛాన్స్ దొరికితే చాలు దూకుడు ని ఎండగడుతున్న అల్లు శిరీష్..!?
మహేష్ నటించిన 'దూకుడు" వందకోట్లు దాటేసిందంటూ ఈ మధ్య ఆ చిత్ర నిర్మాతలు బాహాటంగా ప్రకటించిన విషయం విధితమే. అయితే ఇక్కడ నుంచే వివాదం మొదలయింది. ఎంత పిండి పీల్చీ పిప్పి చేసినా తెలుగు చిత్రం వంద కోట్లు సాధించడంమన్న విషయం మన తెలుగు సినిమాకున్న మార్కెట్ గురించి తెలిసిన వారికి విధితమే.
రికార్డు కొట్టకుండానే రికార్డని ప్రచారం చేసుకుంటున్న దూకుడు నిర్మాతలని అల్లు శిరిష్ అదే పినిగా గిల్లుతున్నాడు. దూకుడువి దొంగ లెక్కలని, దమ్ముంటే బ్యాలెన్స్ షీట్ విడుదల చేయాలని సవాల్ చేసిన శిరీష్ ఛాన్స్ దొరికినప్పుడల్లా దూకుడుని ఎండగడుతున్నాడు. తమ సంస్థ నిర్మించిన మగధీర చిత్రాన్ని బీట్ చేయకుండానే దాటేసిందనే ప్రచారం చేసుకుంటోన్న దూకుడు నిర్మాత తమవి దొంగ లెక్కలని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తానని మెగాఫ్యాన్స్ కి ఛాలెంజ్ చేశాడని ప్రచారం కావడంతో, ఆఫీస్ బోర్డుల్లో, ఫేస్ బుక్కుల్లో కాదు, దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేయమని శీరిష్ పేర్కొన్నాడు.
అయితే అసలు తాను అలాంటి ఛాలెంజేది చేయలేదని దూకుడు నిర్మాత వెనక్కి తగ్గాడనుకోండి. మగధీరని సింగిల్ ఏరియాలో అయినా దూకుడు దాటిందని నిరూపిస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించిన మెగా అభిమానులు దూకుడు" దొంగ రికార్డుల గాలి మొత్తం తీసి పారేశారు. దీనికి మీడీయాలో మంచి మైలేజీ లభించడంతో దూకుడు ఫేక్ రికార్డుల చిట్టా గురించి ఇప్పుడు సామన్య జనానికి కూడా క్లియర్ గా తెలిసిపోయింది.


Click it and Unblock the Notifications











