రెజీనాని వదిలేటట్లు లేడు

By Srikanya

హైదరాబాద్ : కొత్త జంట చిత్రం రిజల్ట్ ఆశావహంగా లేకపోయినా ఆ జంట మరోసారి తెరకెక్కటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అల్లు శిరీష్ తదుపరి చిత్రంలోకి రెజీనానే తీసుకున్నట్లు సమాచారం. ప్రేమ ఇష్క్ కాదల్ దర్శకుడు పవన్ సాదినేని డైరక్షన్ లో రూపొందే ఈ చిత్రంలో మొదట నిత్యామీనన్ ని అనుకున్నారు. అయితే ప్రస్తుతం రెజీనా వచ్చి చేరిందని తెలుస్తోంది. అల్లు శిరీష్ కావాలని ఆమెను రికమెండ్ చేసాడని చెప్పుకుంటున్నారు. అయితే నిత్యామీనన్ డేట్స్ ఖాళీలేక తప్పుకోవటంతోనే ఈ జంటను రిపీట్ చేస్తున్నారని యూనిట్ కి చెందినవారు అంటున్నారు. నిత్యామీనన్ డేట్స్ ...మెగా హీరోలకు దొరకకపోవటమేంటి అని కొందరు ఆరాలు తీస్తున్నారు. ఈ చిత్రాన్ని సైతం అల్లు అరవిందే నిర్మిస్తున్నారు.

అల్లు శిరీష్ తాజా చిత్రం కొత్త జంట రీసెంట్ గా రిలీజై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ప్రమోషన్ తో కొంత గట్టెక్కించాలనే ప్రయత్నం దర్శక,నిర్మాతలు చేస్తున్నారు. అందులో భాగంగా హీరోయిన్ రెజీనా ని దింపారు. ఆమె ఈ సినిమా ని ఓ రేంజిలో పొగడ్తల్లో ముంచెత్తుతూ అన్నీ ఛానెల్స్ లోనూ, న్యూస్ పేపర్లోనూ దర్శనమిస్తోంది. అయితే అసలు ప్రచారం చెయ్యాల్సిన మెగా హీరో అల్లు శిరీష్ మాత్రం బయిటకు రావటం లేదు.

Allu Sirish and Regina Combo To Repeat

సిగ్గుతో రావటం లేదా, లేక మీడియా ముందుకు వస్తే ఏమన్నా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయమా అని అనుమానపడుతున్నారు. పొలిటికల్ గా తన కుటుంబం గురించి మాట్లాడాల్సి వస్తుందని రావటంలేదు అని కొందరంటున్నారు. అదేం కాదు ఎలాగూ రిలీజయ్యి ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది కదా దాన్ని ఏం మోస్తాం అని ఊరుకున్నాడు అని మరికొందరు అభిమానులు సర్ది చెప్తున్నారు. అలాగే గతంలో ట్విట్టర్ లో రెచ్చిపోయే శిరీష్ ఇప్పుడు సైలెంట్ అయ్యిపోయాడని చెప్తున్నారు.

రెజీనా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... 'కొత్త జంట' ఇప్పటికే రెండుసార్లు చూశా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏ కథానాయికకైనా విజయం అత్యవసరం. అది ఈ సినిమాతో దక్కిందని భావిస్తున్నా. శిరీష్‌ సెట్లో చాలా హుషారుగా కనిపించాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నాకు తెలుగు నేర్పించిన తొలి గురువు.. మా దర్శకుడు మారుతి. ఏ సన్నివేశానికైనా రెండు మూడు పేజీల డైలాగులు నా చేతిలో పెట్టేవారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థినిలా అవి చదువుతూ కూర్చునేదాన్ని. అలా తెలుగు వచ్చేసింది అంటోంది.

అలాగే ... ఈ సినిమాలో సువర్ణ ఓ స్వార్థపరురాలు. నిజ జీవితంలోనూ అందరికీ ఎంతో కొంత స్వార్థం ఉంటూనే ఉంటుంది. అయితే నేను మాత్రం సువర్ణలాగా స్వార్థపరురాలిని కాదు. మరో కథానాయిక మధురిమతో కలసి నటించా. తాను మంచి ఫ్రెండ్‌ అయిపోయింది. ఇద్దరు కథానాయికలున్న సినిమాల్లో నటించడానికి నాకు అభ్యంతరం లేదు. ఈ సినిమా చూసి బన్నీ నన్ను మెచ్చుకొన్నారు. 'నీతో ఓ సినిమా చేయాలనివుంది' అన్నారు. ఆయనతో కలసి నటించే ఛాన్స్‌ వస్తే.. వదులుకోను. అయితే ఇప్పటి వరకూ ఆ ప్రతిపాదనేదీ రాలేదు అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X